Ravichandran Ashwin: ఐపీఎల్ మ్యాచులు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. నిన్న జరిగిన డబుల్ హెడ్డర్ మ్యాచులలో అనూహ్య ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఫలితాలు తారుమారైపోయి మంచి మజాను ఇచ్చాయి. వరస ఓటములతో సతమతమవుతున్న ఢిల్లీ అనూహ్యంగా పుంజుకుంది. ప్రత్యర్థి కోల్ కతాపై విజయఢంకా మోగించింది.

నిన్న జరిగిన మ్యాచ్ లో ఓపెనర్లు పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ అద్భుతంగా రాణించడంతో భారీ స్కోర్ చేయగలిగింది. ఇందులో కీలకంగా డేవిడ్ వార్నర్ ఫామ్‌లోకి రావడం కలిసి వచ్చే అంశం. వారిద్దరి భాగస్వామ్యమే మ్యాచ్ గెలుపులో కీలకంగా మారింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 215 రన్స్ చేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన కేకేఆర్.. 19.4 ఓవర్లలో 171 రన్స్ చేసి ఆల్ ఔట్ అయిపోయింది.
Also Read: ముంబై, ఢిల్లీ టీంలకు అదే బలహీనతగా మారింది: రవిశాస్త్రి
ఇక మరో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఇందులో మొదటగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 165 రన్స్ చేసింది. కాగా ఈ తక్కువ పరుగులను కూడా కాపాడుకోగలిగింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ చివరి వరకు ఆడినా కూడా.. 8 వికెట్లు కోల్పోయి 162 రన్స్ మాత్రమే చేసింది.
అయితే ఈ మ్యాచ్‌లో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఔట్ అయిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అతను రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ఇప్పటి వరకు ఐపీఎల్ లీగ్ లో ఇలా ఔట్ అయింది కేవలం అశ్విన్ మాత్రమే. 18.2వ ఓవర్ వేస్తున్న సమయంలో అశ్విన్ సడెన్ గా రిటైర్డ్ అవుట్ గా ప్రకటించుకున్నాడు. 23 బంతుల్లో 28 రన్స్ చేసిన అశ్విన్.. సడెన్ గా అవుట్ ప్రకటించుకున్నాడు. అయితే అతను అలసిపోయినందువల్లే రిటైర్డ్ అవుట్ తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాగా అశ్విన్ తర్వాత వచ్చి సిక్స్ కొట్టి మరీ జట్టును గెలిపించాడు.
Also Read: IPL 2022 CSK: ఐపీఎల్ లో చెన్నై ఓటమికి ప్రధాన కారణం ఈ రెండేనట!