Dissatisfaction in YCP: మంత్రివర్గ విస్తరణతో కొందరికి మోదం కొందరికి ఖేదంలా మారింది. దీంతో కొన్ని చోట్ల ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. మంత్రి పదవులు దక్కని వారు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. పార్టీని నమ్ముకుని ఇన్నాళ్లు ఉన్నా తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని వాపోతున్నారు. అనుచరులతో ఆందోళన చేస్తూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మాత్రం తాము జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని స్వామి భక్తి నిరూపించుకుంటున్నారు.

ఎక్కువ మంది కొత్తవారిని తీసుకున్నా పాత వారికి కూడా స్థానం కల్పించడం విశేషం. సీనియర్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నాలుగు సార్లు గెలిచినా మంత్రిగా అవకాశం ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో అనుచరులతో ఆగ్రహం వ్యక్తం చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఇదే కోవలో చాలా మంది జగన్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు అవకాశం ఇవ్వకపోవడంపై మండిపడుతున్నారు.
Also Read: జగన్ సర్ ప్రైజ్.. సీనియర్లను కాదని.. రోజాకు హోం, రజినీకి మంత్రి పదవి?
భవిష్యత్ కార్యాచరణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. దీంతో మంత్రివర్గ విస్తరణ జగన్ కు తలనొప్పులు తెస్తోంది. ప్రధాన రహదారులపై రాస్తారోకో చేస్తున్నారు. అధినేత నిర్ణయం సమంజసంగా లేదని విమర్శలు చేస్తున్నారు. మాచర్ల నియోజకర్గ ఎమ్మెల్యే సంపూర్ణమ్మ మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకునేుందుకు ప్రయత్నించగా ఆమె మద్దతుదారులు అడ్డుకున్నారు.
కొందరు రాజీనామాలు చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై పెదవి విరుస్తున్నారు. తమకు సముచిత స్థానం ఇవ్వడం లేదని వాపోతున్నారు. భావోద్వేగానికి గురై కంట తడి పెట్టుకుంటున్నారు. జగన్ నిర్ణయం ఏకపక్షంగా ఉందని ఆరోపిస్తున్నారు. మొత్తానికి మంత్రివర్గ విస్తరణతో జగన్ అప్రదిష్టను మూటగట్టుకునే పరిస్థితి ఎదురవుతోంది. మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడంతో మేకపాటి సుచరిత ఆందోళన చేశారు.
Also Read: ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రుల జాబితా ఇదే
[…] Also Read: వైసీపీ లో అసంతృప్తి జ్వాలలు రోడ్డుకె… […]