https://oktelugu.com/

Rasi Phalalu: నేడు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి!

Rasi Phalalu:  మేషం: ఈ రోజు మీరు ఓ శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో ట్రిప్స్ ఎంజాయ్ చేస్తారు. కొన్ని కష్టమైన పనులు చేయాల్సి ఉంటుంది. మీరు మరో పై స్థాయిని పొందే అవకాశం ఉంది. వృషభం: ఈరోజు మీకు ఇతరుల సహాయం అందుతుంది. ఒత్తిడితో కూడిన పనులు చేయకపోవడం మంచిది. పిల్లల భవిష్యత్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. మిథునం: ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒక వార్త మిమ్మల్ని […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 21, 2022 / 08:36 AM IST
    Follow us on

    Rasi Phalalu:  మేషం: ఈ రోజు మీరు ఓ శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో ట్రిప్స్ ఎంజాయ్ చేస్తారు. కొన్ని కష్టమైన పనులు చేయాల్సి ఉంటుంది. మీరు మరో పై స్థాయిని పొందే అవకాశం ఉంది.

    Rasi Phalalu

    వృషభం: ఈరోజు మీకు ఇతరుల సహాయం అందుతుంది. ఒత్తిడితో కూడిన పనులు చేయకపోవడం మంచిది. పిల్లల భవిష్యత్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.

    మిథునం: ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒక వార్త మిమ్మల్ని బాధ పెడుతుంది. వ్యాపారస్తులకు ఇతరుల సహాయం అందుతుంది.

    కర్కాటకం: ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు. కొన్ని విషయాల గురించి చర్చలు చేసేటప్పుడు ఆలోచించాలి. తోబుట్టువులతో వాదనలకు దిగకండి.

    సింహం: ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో వాదనకు దిగే అవకాశం ఉంది. దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి. కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

    కన్య: ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు. తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది. వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయం తీసుకోవాలి.

    తుల: ఈరోజు మీకు ఇతరుల సహాయం అందుతుంది. అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు. అనవసరమైన విషయాల గురించి పట్టించుకోకండి.

    వృశ్చికం: ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా ఆలోచించి చేయాలి. ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.

    ధనుస్సు: ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు. విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది. నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు.

    Also Read: మోడీతో ఫైట్: చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్ కు పడుతుందా?

    మకరం: ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. భవిష్యత్తు గురించి బాగా ఆలోచించాలి. మీరు పనిచేసే చోట ఇబ్బందులెదురవుతాయి.

    కుంభం: ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులెదురవుతాయి. ఉద్యోగస్తులకు నష్టాలు బాగా ఉన్నాయి. మీ స్నేహితులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.

    మీనం: ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది. అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.

    Also Read: “కలియుగ కర్ణుడు” సోనూసూద్‌ పై కేసు నమోదు

    Recommended Video: