Gold Slives Prices: ఇతర దేశాల ప్రజలతో పోలిస్తే మన దేశ ప్రజలు బంగారాన్ని కొనుగోలు చేయడంపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తారనే సంగతి తెలిసిందే. బంగారాన్ని మన దేశ ప్రజలు పెట్టుబడిగా కూడా భావిస్తారు. బంగారంలో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో మంచి లాభాలను పొందే అవకాశంతో పాటు తక్కువ వడ్డీకే రుణాలను పొందే అవకాశం కూడా ఉంటుందని చెప్పవచ్చు. హైదరాబాద్ లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గగా వెండి ధరలు పెరగడం గమనార్హం.
Also Read: గౌతం రెడ్డి హఠాన్మరణం: యువతలో గుండెపోటుకు కారణాలేంటి?
హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 50,190 రూపాయలుగా ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర 46,300 రూపాయలుగా ఉంది. వెండి ధరలు కూడా పెరగగా కిలో వెండి ధర 68,600 రూపాయలుగా ఉండటం గమనార్హం.
గత రెండు రోజులుగా వెండి ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అయితే దేశీయ మార్కెట్ లో బంగారం ధరలు తగ్గినా అంతర్జాతీయ మార్కెట్ లో మాత్రం పెరగడం గమనార్హం. బంగారం రేటుపై వేర్వేరు అంశాలు ప్రభావం చూపుతాయనే సంగతి తెలిసిందే. మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీని బట్టి బంగారం రేట్లలో కొనుగోలు చేసే సమయంలో మార్పు ఉంటుంది.
Also Read: మోడీతో ఫైట్: చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్ కు పడుతుందా?
Recommended Video: