Ranchi Street Food: తినడం అనేది ఒక కళ. కొంతమంది ఆదరాబాదరాగా తింటారు. ఇంకొందరేమో ఆస్వాదిస్తూ తింటారు. ఎలా తిన్నప్పటికీ ఆకలిని తీర్చుకోవడమే అందరి లక్ష్యం. మనుషులలో విభిన్నత్వమున్నట్టు.. తిండిలో కూడా రకరకాలు ఉంటాయి. ప్రాంతానికి తగ్గట్టుగా వంటకాలు లభిస్తుంటా. కొంతమంది శాఖాహారాన్ని ఇష్టపడితే.. మరి కొంతమంది మాంసాహారాన్ని ఇష్టపడుతుంటారు. శాకాహారం లోను రకరకాల వంటకాలు అందుబాటులో ఉంటాయి. మాంసాహారంలోనూ అదే తీరుగా ఉంటాయి. ఇప్పుడు మీరు చదవబోయే కథనంలో మాంసంతో తయారు చేసిన వంటకం చాలా విభిన్నమైనది. ఇది ఆ ఊరికే ప్రత్యేకతగా నిలిచింది.
Also Read: డయాబెటిక్ ఉన్నా పర్వాలేదు.. ఈ బిర్యానీని లొట్టలు వేసుకుంటూ తినొచ్చు..
టీమిండియా లెజెండ్ క్రికెటర్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు శారీరక సామర్థ్యానికి ఎంత ప్రాధాన్యం అయితే ఇస్తాడో.. తిండికి కూడా అదే స్థాయిలో ఇంపార్టెన్స్ ఇస్తాడు. స్వచ్ఛమైన పాలు తాగుతాడు.. మాంసాన్ని మితంగా తింటాడు. ధోని పుట్టిన సొంత ఊరైన రాంచీలో అనేక వంటకాలు ఫేమస్. అయితే అందులో పత్తే వాలే మటన్ చావల్ బహుళ ప్రాచుర్యం పొందింది. ఈ వంటకాన్ని తినడానికి ఎక్కడెక్కడ నుంచో వస్తుంటారు. అలాగని ఈ డిష్ 5 స్టార్ హోటల్ లో లభించదు. అలాగని పేరుపొందిన హోటల్స్ లో మెనుగా ఉండదు. జస్ట్ స్ట్రీట్ ఫుడ్ గా అది అక్కడి ప్రజలకు సుపరిచితం.. తినే వాళ్లకు జిహ్వ ప్రియం. ఈ వంటకాన్ని ఆస్వాదించడానికి వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు అంటే అతిశయోక్తి కాదు.
మందంగా ఉన్న మోదుగు ఆకులను విస్తరి ఆకులాగా వేప పుల్లలతో కుడతారు. ఆ తర్వాత చిన్న చిన్న ఆకులతో డొప్పలను తయారు చేస్తారు.. కర్రలపై మీద వేడి వేడి అన్నం వండుతారు. విస్తరి ఆకులో అన్నాన్ని.. కీర దోసకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, నంజుకోవడానికి అప్పడాలు, పల్లీలు మిరియాల మిశ్రమంతో తయారుచేసిన చారు పోస్తారు. ఆ తర్వాత పచ్చి ఆకు డొప్పలలో వేడివేడి మటన్ వేస్తారు. అందులో మూలుగ బొక్క కంపల్సరీ. ఇంకా కొన్ని రకాల కూరలు కూడా వేస్తారు. అయితే చాలామంది ఈ మటన్ తినడానికే వస్తుంటారు. పైగా పచ్చి ఆకులలో అన్నాన్ని తినడాన్ని గొప్పగా ఫీల్ అవుతుంటారు. పచ్చి ఆకులలో వేడి వేడి అన్నం.. మటన్ కూర కలుపుకొని తింటే ఆ ఆస్వాదన వేరే లెవెల్ లో ఉంటుందని పర్యాటకులు చెబుతుంటారు. స్థానికులు కూడా ఈ డిష్ ను లొట్టలు వేసుకొని తింటారు. సాధారణంగా రాంచీలో స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు ఎక్కువగా ఉంటాయి. ఆ నిర్వాహకులు భారీగాఅద్దెలు చెల్లించాల్సిన అవసరం లేకపోవడం వల్ల తక్కువ ధరకే ఈ మటన్ చావల్ ను అందిస్తున్నారు. ఒక ప్లేట్ మటన్ చావల్ కు 150 నుంచి 180 వరకు చార్జ్ చేస్తుంటారు. మటన్ ముక్కలను ఒకసారి సర్వ్ చేస్తారు. గ్రేవీ మాత్రం అన్లిమిటెడ్ గా వేస్తుంటారు.. మటన్ చావల్ ఫేమస్ కావడంతో.. రాంచీలో చాలావరకు స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు ఏర్పాటయ్యాయి.. ప్రస్తుతం ఈ బిజినెస్ అక్కడ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.
Also Read: టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ దారుణం.. భర్తకు బదులుగా మరో వ్యక్తి ?
రాంచి పరిసర ప్రాంతాల్లో పంట పొలాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ గొర్రెల కాపర్లు కూడా అదే స్థాయిలో ఉంటారు. వారి వద్ద నాణ్యమైన గొర్రెపోతులు లభిస్తుంటాయి. మటన్ వండడానికి నిర్వాహకులు నాణ్యమైన గొర్రెపోతులను మాత్రమే ఉపయోగిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో గొర్రెలను, మేకలను ఉపయోగించరు. అనివార్య పరిస్థితుల్లో మేకపోతుల మాంసాన్ని ఉపయోగిస్తుంటారు. అంతేతప్ప మాంసం లో ఏమాత్రం రాజీపడరు. అందువల్లే ఇక్కడి స్ట్రీట్ ఫుడ్ ఈ స్థాయిలో క్లిక్ అయింది.