Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ హిస్టరీ లో ఎన్నడూ లేని విధంగా ఈసారి 8 మంది సామాన్యులకు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి, టాప్ మోస్ట్ సెలారిటీలతో పోటీ పడే అద్భుతమైన అవకాశాన్ని బిగ్ బాస్ టీం అందించిన సంగతి తెలిసిందే. అందుకోసం ప్రత్యేకంగా ఒక అప్లికేషన్ ని మొదలు రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం మీద 200 మందిని ఎంచుకుంటారని. అందులో వివిధ రకాల పోటీలను నిర్వహిస్తూ , ఫిల్టర్ చేసి చివరికి 8 మందిని బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లోకి పంపుతారని చెప్పుకొచ్చారు. ఈ ప్రక్రియ దాదాపుగా పూర్తి అయ్యిందట. ఇక కేవలం 20 మంది మిగిలిలారట. వీళ్లకు అగ్నిపరీక్ష నిర్వహించి, కేవలం 8 మందిని ఎంచుకుంటారు. ఈ అగ్నిపరీక్ష ప్రోగ్రాం లో వివిధ గేమ్స్ ని నిర్వహించి గెలిచినా వాళ్ళని తీసుకుంటారట.
Also Read: కింగ్ డమ్ ఫస్ట్ రివ్యూ… విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కాలర్ ఎగరేయొచ్చా?
త్వరలోనే ఈ స్పెషల్ ప్రోగ్రాం కి సంబంధించిన ప్రోమో ని విడుదల చేయనుంది బిగ్ బాస్ టీం. అయితే ఈ ప్రోగ్రాం టీవీ లో కూడా టెలికాస్ట్ అవుతుందా, లేకపోతే కేవలం జియో హాట్ స్టార్ లో మాత్రమే చూడాలా అనేది తెలియాల్సి ఉండి. ఈ ప్రోగ్రాం కి హోస్ట్ గా శ్రీముఖి(Anchor Srimukhi) వ్యవహరంచబోతుంది. అదే విధంగా శివ బాలాజీ(Siva Balaji), కౌశల్(Kaushal Manda), బిందు మాధవి(Bindhu Madhavi), శివాజీ(Sivaji) వంటి వారు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తారు. వీళ్ళే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోయే 8 మంది కంటెస్టెంట్స్ ని ఎంపిక చేస్తారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లు మొత్తం పూర్తి అయ్యాయట. ముందుగా సీజన్ 5 నుండి సన్నీ ని, అదే విధంగా సీజన్ 4 టైటిల్ విన్నర్ అభిజిత్ ని సంప్రదించారట. వీళ్లిద్దరు అందుబాటులో లేకపోవడంతో వాళ్ళ స్థానంలోకి బిందు మాధవి,శివ బాలాజీ వచ్చారు. మరి ఈ ప్రోగ్రాం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. అయితే సామాన్యుల ఎంపిక విషయం లో చిన్నపాటి కాంట్రవర్సీ దాగుంది.
రీసెంట్ గా సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోయిన పేరు అలేఖ్య చిట్టి పికిల్స్. కస్టమర్స్ తో బూతులు మాట్లాడి ఈ అక్కాచెల్లెళ్లు ఓవర్ నైట్ స్టార్స్ గా మారిపోయారు. వీరిలో ఎవరో ఒకరు బిగ్ బాస్ లోకి అడుగుపెట్టబోతున్నారు అంటూ చాలా కాలం నుండి ఒక రూమర్ వినిపిస్తుంది. కానీ బిగ్ బాస్ టీం ఇప్పటికే ఎంపిక చేసిరి పెట్టారట. వీళ్ళు సామాన్యులు ఏంటి?, అదే విధంగా సామాన్యుల క్యాటగిరీలోనే ప్రముఖ టిక్ టాక్ సెలబ్రిటీ ఉప్పల్ బాలు ని సామాన్యుల క్యాటగిరీలోనే ఎంచుకుంటారట. గతంలో పల్లవి ప్రశాంత్, ఆది రెడ్డి వంటి వాళ్ళు ఎలాంటి సామాన్యులో, వీళ్ళు కూడా అలాంటి సామాన్యులే అన్నమాట. ఈ మాత్రం దానికి ఇంత పెద్ద ప్రక్రియ ఎందుకు, నేరుగా వాళ్లనే ఎంచుకోవాల్సింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మండిపడుతున్నారు.