Rekha Jhunjhunwala: వ్యాపార పెట్టుబడులకు భారత్ అనువైన దేశం. ఇక్కడ నెలకొల్పిన వ్యాపారాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. పలు వ్యాపారాలు చేసే వ్యక్తులు వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. వారిలో రాకేష్ ఝున్ ఝన్ వాలా ఒకరు. 2021 నాటికి 5.8 బిలియన్ల ఆదాయంతో అత్యంత సంపన్నుడిగా నిలిచాడు రాకేష్. అయితే ఇప్పుడు ఆయన భార్య కూడా వార్తల్లోకెక్కింది. రాకేష్ జీవితాంతం సంపాదించిన ఆస్తిని ఆమె నిమిషాల్లోనే క్రెడిట్ పొందడం ఆశ్చర్యంగా మారింది. ఇంతటి ఆదాయం రావడానికి ఆమె పెద్దగా ప్రయాస పడలేదు. కానీ చిన్న ఆలోచనే ఆమెకు కోట్లు తెచ్చిపెట్టింది. ఇంతకీ ఆమెకు ఇంత డబ్బు ఎలా వచ్చింది?
రాకేష్ ఝున్ ఝున్ వాలా సతీమణి రేఖా ఝున్ ఝున్ వాలా. భర్త చేసే వ్యాపారల్లో ఈమె ఎప్పుడూ సపోర్టుగా ఉంటుంది. అయితే రేఖా నేరుగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టకుండా భర్త సహకారంతో ఆమె టైటాన్ అనే సంస్థలో పెట్టుబడులు పెట్టింది. రేఖా ఝున్ ఝున్ వాలాకు టైటాన్ కంపెనీలో 5.29 షేర్ ఉంది. టాటా గ్రూప్ కు చెందిన టైటాన్ కు సంబంధించిన మల్టీ బ్యాగర్ షేర్ శుక్రవారం ఒక్కరోజులోనే రూ.105.40 మేర షేర్ ధర పెరిగింది. గురువారం రాత్రి ముగిసిన తరువాత శుక్రవాం టైటాన్ కంపెనీ షేర్లు ట్రేడింగ్ లోకి రాగానే నిమిషాల్లో 3.39 శాతం పెరిగి రూ.3,211 చేరింది.
దీంతో కంపెనీ క్యాపిటైలేజేషన్ ఆల్ టైమ్ రూ.2,85,077 కోట్లకు చేరింది. గత సెషన్ లో రూ.275, 720 కోట్లు ఉండగా రూ.9,357 కోట్లకు పెరిగింది. ఏడాది కాలంగా చూస్తే టైటాన్ షేర్ 50 శాతానికి పైగా పెరిగింది. 2022 జూలై 7 నాటికి బీఎస్ సీలో రూ.2138 ఉన్న షేర్లు శుక్రవారం ఒక్కరోజే రూ.3211.10కి చేరింది. దీంతో 2023లో 25 శాతం పెరిగాయి. టైటాన్ కీలక వ్యాపారలు రెండంకెల వృద్ధి సాధించి క్యూ 1 లో ఫలితాల్లో 20 శాతం ఆదాయం వృద్ధి సాధించినట్లు లెక్కలు తెలుపుతున్నాయి.
ఇవే కాకుండా ఆభరణాల వ్యాపారం సంవత్సరకాలంలో 21 శాతం వృద్ధి నమోదైంది. ఈ క్రమంలో రేఖా ఝున్ ఝున్ వాలా కేవలం నిమిషాల వ్యవధిలోనే రూ.495 కోట్ల ఆదాయం అర్జించారు. కాగా గత త్రైమాసికంలో టైటాన్ మొత్తం 18 స్టోర్లను కొత్తగా ప్రారంభించింది. ప్రస్తతం అవి 559కి చేరాయి.