
మనలో చాలామంది ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఫ్రిజ్ ను ఉపయోగిస్తూ ఉంటారు. వేడి వల్ల బయట వదిలేస్తే కొన్ని ఆహార పదార్థాలు కుళ్లిపోయే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. అయితే ప్రతి ఆహార పదార్థాన్ని ఫ్రిజ్ లో నిల్వ చేసినా సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. రిఫ్రిజిరేటర్‌లో భద్రపరచడం వల్ల కొన్ని ఆహారపదార్థాలు రుచిని కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది.
ఆహార పదార్థాలను తినడం వల్ల మన ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు. మామిడి, పుచ్చకాయలను ఫ్రిజ్ లో నిల్వ చేస్తే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవని చెప్పాలి. పుచ్చకాయను కట్ చేయకుండా ఫ్రిజ్ లో ఉంచితే పండ్ల రుచి, దాని రంగు మారిపోతుంది. పండ్ల లోపల బ్యాక్టీరియా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఆ పండ్లను రిఫ్రిజిరేటర్‌లో భద్రపరచాలని అనుకుంటే పండ్లను కట్ చేసి ఫ్రిజ్ లో ఉంచడం మంచిది.
మామిడిపండ్లను కూడా కట్ చేయకుండా ఫ్రిజ్ లో ఉంచకూడదు. మామిడిపండ్లను కొనుగోలు చేసిన తర్వాత చల్లటి నీటిలో కొంత సమయం నానబెట్టి ఆపై వాటిని గది ఉష్ణోగ్రతలో కొద్దిసేపు ఉంచాలి. రుచి చూసే ముందు మీరు వాటిని కట్ చేసి చల్లబరచడానికి ఫ్రిజ్ లో కూడా పెట్టవచ్చు. కట్ చేసిన పండ్లను మూసివేసి ఉంచడం అస్సలు మరిచిపోకూడదు. పండ్లు, కూరగాయలను ఒకే షెల్ఫ్‌లో భద్రపరచడం కూడా మంచి పద్ధతి కాదని గుర్తుంచుకోవాలి.
పండ్లు, కూరగాయలను వేర్వేరు బుట్టలలో ఉంచితే మంచిది. పండ్లు, కూరగాయలు వివిధ రకాలైన వాయువులను విడుదల చేస్తాయనే సంగతి తెలిసిందే.