ఉద్యోగులకు మోదీ సర్కార్ శుభవార్త.. రూ.25 వేలకు పెంపు..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. డియర్‌నెస్ అలవెన్స్ పెంపు కంటే ముందే కేంద్రం మరో శుభవార్త చెప్పడం గమనార్హం. నవోదయ విద్యాలయ స్కూల్ ఉద్యోగులకు కేంద్రం ఈ శుభవార్తను చెప్పడం గమనార్హం. మరోవైపు కేంద్రం మెడికల్ క్లెయిమ్ పరిమితిని కూడా పెంచి ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా చేసింది. ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ తాజా ఉత్తర్వుల ప్రకారం నవోదయ విద్యాలయ సమితి ఉద్యోగులకు మెడికల్ రీయింబర్స్‌మెంట్ పరిమితి భారీగా […]

Written By: Navya, Updated On : June 16, 2021 1:00 pm
Follow us on

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. డియర్‌నెస్ అలవెన్స్ పెంపు కంటే ముందే కేంద్రం మరో శుభవార్త చెప్పడం గమనార్హం. నవోదయ విద్యాలయ స్కూల్ ఉద్యోగులకు కేంద్రం ఈ శుభవార్తను చెప్పడం గమనార్హం. మరోవైపు కేంద్రం మెడికల్ క్లెయిమ్ పరిమితిని కూడా పెంచి ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా చేసింది.

ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ తాజా ఉత్తర్వుల ప్రకారం నవోదయ విద్యాలయ సమితి ఉద్యోగులకు మెడికల్ రీయింబర్స్‌మెంట్ పరిమితి భారీగా పెరిగింది. గతంలో వీరికి కేవలం 5వేల రూపాయలు మాత్రమే రీయింబర్స్‌మెంట్ ఉండేది. ప్రస్తుతం ఉద్యోగులు ఏకంగా రూ.25 వేల వరకు రీయింబర్స్‌మెంట్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. ప్రభుత్వ లేదా సీజీహెచ్‌ఎస్ రిజిస్టర్డ్ హాస్పిటల్స్‌లో ఉద్యోగులు వైద్యం చేయించుకుంటే వారి ట్రీట్ మెంట్ పరిమితి పెరిగిందనే విషయం గుర్తుంచుకోవాలి.

మెడికల్ రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన ఇతర నిబంధనలు సైతం ఇదే విధంగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. జూన్ నెల 25వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించిన నిబంధనలను సవరించింది. ఇందులో డీఏ బకాయిల చెల్లింపు అంశంపై ప్రధానంగా చర్చ జరగనుందని తెలుస్తోంది. మోదీ సర్కార్ జూలై 1 నుంచి పెండింగ్‌లో ఉన్న మూడు ఇన్‌స్టాల్‌మెంట్ల డీఏ పెంపు డబ్బులను ఉద్యోగులకు చెల్లించనుందని సమాచారం అందుతోంది.

ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ నుంచి జారీ అయిన ఉత్తర్వుల వల్ల నవోదయ విద్యాలయ స్కూల్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుందని చెప్పాలి. ఉద్యోగులకు మేలు జరిగే విధంగా మోదీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలను నెటిజన్లు ప్రశంసిస్తూ ఉండటం గమనార్హం.