Principle of life: జీవితంలో మనిషికి డబ్బు తోపాటు విలువ కూడా ఉండాలి. ఈ విలువతోనే ఎదుటివారి నుంచి గుర్తింపు లభిస్తుంది. విలువ అనేది మార్కెట్లో దొరికే వస్తువు కాదు. విలువ రావాలంటే కొన్ని పనులు ప్రత్యేకంగా చేయాలి. అంటే ప్రవర్తనలో కొన్ని మార్పులు తీసుకురావాలి. ఈ మార్పు ఎలా ఉంటుందంటే ఒక్కోచోట మనం మాట్లాడిన ఎవరూ పట్టించుకోరు.. కానీ కొన్నిచోట్ల మనం చెప్పే ప్రతి విషయాన్ని శ్రద్ధగా వింటారు. అంటే కొన్నిచోట్ల విలువ ఉంటుంది. మరికొన్ని చోట్ల విలువ ఉండదు. విలువ లేని చోట ఉండడం వృధాప్యాసే. మరి ఈ విలువ అనేది ఎలాంటిది అని చెప్పడానికి ఈ చిన్న స్టోరీ ఉదాహరణ. అదేంటంటే?
ప్రతిరోజు ఉదయం టీ తాగడం చాలామందికి అలవాటు. టీ లో పాలతో పాటు చక్కెర కూడా ఉంటుంది. టీ లో చక్కెర వేయడం వల్ల ఎంతో రుచిగా ఉంటుంది. అదే టీ లో చక్కెరకు బదలు ఉప్పు వేస్తే ఎలా ఉంటుంది? ఉప్పు వేసినా ఛాయను తాగగలమా? అలాగే రోజు అన్నంలోకి వండుకునే కూరలో ఉప్పు వేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఉప్పుకు బదులు చక్కెర వేస్తామంటే కుదురుతుందా? అంటే దేనికి ఎక్కడ ఉన్న విలువ అక్కడ ఉంటుంది.
Also Read: స్టార్ హీరోల సినిమాల రిలీజ్ ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అవ్వడానికి కారణం ఏంటి..?అసలేం జరుగుతుంది…
అలాగే మనుషుల విలువ కూడా అంతే. మనుషులకు కొన్నిచోట్ల ప్రాధాన్యత ఉంటుంది. ఇలాంటి చోట ఏం చేసినా పర్వాలేదు. కానీ విలువ లేని చోట.. వారిని పట్టించుకోని ప్రదేశంలో ఎలాంటి ప్రయోగాలు చేయకుండా ఉండాలి. అంటే ఇక్కడ కేవలం మౌనంగా ఉండడమే మంచిది. మౌనంగా ఉండడం వల్ల ఎంతో విలువ తో పాటు గౌరవం కూడా ఉంటుంది. అందువల్ల విలువ లేని చోట ఉండడం కూడా దండగే.
కొందరు ఉద్యోగాలు చేసే కార్యాలయాల్లో గుర్తింపు లభించదు. వారు ఎంత కష్టపడినా పై అధికారులు పట్టించుకోరు. ఇలాంటి సంస్థలు లేదా కార్యాలయాల్లో పనిచేయడం కంటే ఇతర కార్యాలయాల్లోకి మారడం మంచి పరిణామం. అంతేకాకుండా కుటుంబంలోనూ ఇదే విషయం వర్తిస్తుంది. బంధువుల ఇళ్లల్లో కొందరు గుర్తింపును ఇవ్వడానికి నిరాకరిస్తారు. అలాంటి వారితో స్నేహం చేయడం కూడా వృధానే అవుతుంది. ఇలా జీవితంలో గుర్తింపు కోసం ప్రత్యేకంగా తనకు తానుగా కొన్ని మలుచుకోవాల్సి ఉంటుంది. అయితే కొందరు ఎంత పద్ధతిగా ప్రవర్తించినా.. మంచి ప్రవర్తనతో కొనసాగినా.. గుర్తింపు రాదు. అలాంటప్పుడు నిజాయితీగా ఉన్నవారు అయితే గుర్తింపు ఉన్నచోటికే వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడే తాము చేసే పనులకు విలువ పెరుగుతుంది. అలా కాకుండా ఒకచోట గుర్తింపు వచ్చినా.. మరోచోట కూడా ఇదే విలువ ఉండాలని కోరుకునే వారు అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తారు. కానీ ఇది సమయం సందర్భాన్ని బట్టి చేయడం వల్ల సాధ్యమవుతుంది. లేకుంటే వ్యతిరేక పవనాలు వీచే అవకాశం ఉంటుంది.
సమాజంలో చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు బాగుంటే అనుకోకుండానే గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. అదే చుట్టూ ఉన్న వాతావరణం బాగా లేకపోతే కూడా అక్కడ ఉంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు.