Pressure Cooker: మన దేశంలోని ప్రజలకు అన్నం ప్రధాన ఆహారం అనే సంగతి తెలిసిందే. రోజులో ఒక్కపూట అన్నం తిన్నా చురుకుగా పని చేయడం సాధ్యమవుతుంది. ప్రస్తుతం ప్రెజర్ కుక్కర్ లో అన్నం వండి తినేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే ప్రెజర్ కుక్కర్ లో వండిన అన్నం తినే విషయంలో చాలామందికి అనేక సందేహాలు ఉన్నాయి. అయితే వైద్య నిపుణులు మాత్రం ప్రెజర్ కుక్కర్ లో వండిన అన్నం తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు.
ప్రెజర్ కుక్కర్ లో వండిన అన్నం తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభించే అవకాశంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ప్రెజర్ కుక్కర్ లో వండిన అన్నం తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ పరిశోధనల ప్రకారం ప్రెజర్ కుక్కర్ లో ఉడికించిన అన్నంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ప్రెజర్ కుక్కర్ లో వండిన అన్నం తింటే ప్రమాదకరమైన ఫంగస్ బ్యాక్టీరియాలు కూడా నశిస్తాయి.
Also Read: మోడీది ఏం తప్పులేదా? ఆ రెండు పత్రికలదే తప్పా?
రైస్ త్వరగా ఉడకాలనే ఆలోచనతో కొంతమంది బియ్యాన్ని నానబెట్టి కడుగుతారు. ఇలా చేయడం వల్ల బియ్యంలోని పోషకాలను కోల్పోయే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అన్నంలో శరీరానికి అవసరమైన ఫోలేట్, పాస్ఫరస్, ఐరన్, మెగ్నీషియం, పోటాషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ప్రెజర్ కుక్కర్ లో అన్నం వండితే మాత్రమే మనకు ఈ పోషకాలు లభించే ఛాన్స్ ఉంటుంది.
తక్కువ నీటితోనే ప్రెజర్ కుక్కర్ లో అన్నం వండుతారు కాబట్టి నీటి ద్వారా పోషకాలు బయటకు పోయే అవకాశం అయితే ఉండదని గుర్తుంచుకోవాలి. ప్రెజర్ కుక్కర్ లో వండిన అన్నం తినేవారు ఎలాంటి సందేహాలు అవసరం లేకుండా ఈ విధంగా వండిన అన్నం తింటే మంచిదని చెప్పవచ్చు.
Also Read: రష్యా, ఉక్రెయిన్.. ఎవరి సత్తా ఎంత? సైన్యం బలాబలాలివీ!