Pregnancy-Snake: మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి ఆరోగ్య విషయంలోనే కాకుండా అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. తినే ఆహారం నుంచి చేసే ప్రతి పనిలో కూడా జాగ్రత్త వహిస్తారు. తల్లి కావడం అనేది గొప్ప వరం. ఇలాంటి సమయంలో మహిళలు జాగ్రత్త వహించక తప్పదు. సాధారణంగా ఏవైనా జీవాలను చూస్తేనే భయం వేస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో వాటి నుంచి చాలా దూరంగా ఉంటారు. అయితే పాములు అంటే చాలా మందికి భయం ఉంటుంది. వీటిని చూస్తే చాలు ఆమడ దూరంలో ఉంటారు. సాధారణంగా పాములు ఎవరిని చూసిన కాటేస్తాయి. పాము కాటుకు గురైతే చాలా కష్టం కూడా. అయితే గర్భిణులను అసలు పాములు కాటేయవట. నిజం చెప్పాలంటే అందరూ పాములకు భయపడి దూరంగా ఉంటే గర్భిణులకు పాముల భయపడి దూరంగా ఉంటాయి. ఒకవేళ వీటి దగ్గరకు వచ్చిన కూడా కాటేయవు. వాటికి గర్భిణి ఎవరనే విషయం కూడా తెలుస్తుందట. అసలు పాములకు మహిళలు గర్భిణులుగా ఉన్నారని ఎలా తెలుస్తుంది? అసలు ఎందుకు పాములు గర్భిణులను కాటేయవు? దీని వెనుక ఏవైనా కారణాలు ఉన్నాయా? అనే పూర్తి విషయాలు తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.
పాములకు కొన్ని శక్తులు ఉంటాయి. గర్భం దాల్చిన స్త్రీలను అవి ఈజీగా గుర్తుపడతాయి. పాములకు ఉన్న ప్రత్యేక ఇంద్రియాల వల్ల అవి ఈజీగా గుర్తిస్తాయి. దీంతో వారిని అవి కాటేయవు. అయితే వీటి వెనుక ఓ కారణం ఉందని పురాణాలు చెబుతున్నాయి. గర్భిణి శివుని ఆలయంలో కూర్చుని తపస్సు చేస్తుందట. ఇలా తపస్సు చేస్తూ శివుని భక్తిలో మునిగిపోయింది. ఇంతలో ఆ ఆలయంలోకి వచ్చిన పాములు గర్భిణిని ఇబ్బంది పెట్టాయి. దీంతో ఆమె శివుని భక్తితో తపస్సు చేయలేకపోయింది. అప్పుడు గర్భిణి కడుపులో ఉన్న బిడ్డ నాగవంశం మొత్తానికి శాపం విధించింది. గర్భిణుల దగ్గరకు వెళ్తే కళ్లు కనబడకూడదని శాపం పెట్టింది. దీంతో పాములు గర్భిణులను కాటేయలేవు. అయితే ఇది ఎంత వరకు నిజమో తెలియదు. అయితే పాములు గర్భిణులను కాటేయక పోవడానికి ఇవే కాకుండా మరో కారణాలు కూడా ఉన్నాయి. గర్భిణుల శరీరంలో వచ్చే హార్మోన్ల మార్పుల వల్ల కూడా వారిని పాములు కాటేయవని అంటున్నారు.
గర్భిణుల్లో హార్మోన్ల మార్పులు వస్తాయి. గర్భం దాల్చినప్పటి నుంచి వారి శరీరంలో మార్పులు అనేవి సహజం. అయితే వీటివల్ల అవి వాసన పసిగట్టి గర్భిణులను కాటేయవట. వాటికి ఉన్న ఇంద్రియాల బట్టి అవి గర్భిణులను గుర్తించి కాటేయవు. అసలు కనీసం గర్భిణుల దగ్గరకు పాములు రావట. ఒకవేళ పొరపాటున వచ్చిన కూడా అవి గర్భిణులను కాటేయవని శాస్త్రీయ కారణాలు చెబుతున్నాయి. అయితే ఇవన్నీ పురాణాలు, శాస్త్రీయంగా చెబుతున్నాయి. మరి ఇందులో నిజమెంతో పూర్తిగా తెలియదు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలన్నీ కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.