Precautions for Flying: మానవ శరీరంలో ప్రతి అవయం ప్రధానమైనదే. అయితే మొహంలోని అవయవాలను జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవి చాలా సున్నితంగా ఉంటాయి. కొన్ని కారణాలవల్ల ఇవి తొందరగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ముఖంలోని కన్ను, ముక్కు, చెవులు నష్టపోతే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటిలో వినికిడి సమస్య కోల్పోతే ఎదుటివారి చెప్పే మాటలు వినలేక పోతారు. అయితే విమానంలో ప్రయాణం చేసే సమయంలో వచ్చే సౌండ్తో చెవికి ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అందుకు ఉదాహరణగా ఇటీవల ఒక సింగర్ ప్రయాణం చేసే సమయంలో తాను ఎదుర్కొన్న అనుభవంతో తన చెవికి తీవ్ర నష్టం కలిగింది. అసలు విమానంలో ప్రయాణం చేసేటప్పుడు చెవులు ఎలా దెబ్బతింటాయి? ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
విమాన ప్రయాణం అంటే చాలామందికి ఇష్టమే ఉంటుంది. ఎందుకంటే భూమికి కొంత అడుగుల దూరంలో పైకి ఎగిరి ప్రయాణం చేయడం అంటే చాలా సరదాగా ఉంటుంది. అయితే విమానం భూమిపై నుంచి పైకి ఎదిగే కొద్దీ పీడనం పెరిగిపోతుంది. గాలి సాంద్రత తగ్గుతుంది. ఈ ప్రభావం ప్రధానంగా చెవులపై ఎక్కువగా పడుతుంది. విమానం పైకి ఎగిరేకొద్ది చెవుల్లో మంట లేదా నొప్పి లాగా ఏర్పడుతుంది. ఆ తర్వాత ఎలాంటి శబ్దాలు క్లియర్గా వినిపించే అవకాశాలు ఉండవు. మన చెవిలో Eustachian Tube అనే చిన్న పైపు లాంటిది ఉంటుంది. ఇది లోపలి చెవిని బయటకాలికి సమానంగా ఉండేలా చేస్తుంది. అయితే విమానం ఎగిరినప్పుడు, లేదా కిందికి లాంటి అయినప్పుడు ఈ పైపు బ్లాక్ అయిపోతుంది. దీంతో శబ్దం తగ్గిపోవడం చెవిలో మంట రావడం కలుగుతుంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే ఆపరేషన్ చేసే స్థాయికి వెళ్లే అవకాశం ఉంటుంది.
ప్రముఖ గాయని ఆల్కా యాగ్నిక్ ఒకసారి తాను విమానంలో ప్రయాణం చేసినప్పుడు తనకు చెవిలో సమస్యలు వచ్చినట్లు వెల్లడించారు. వైద్యులు తెలిపిన ప్రకారం ఆమె చెవిలో సడెన్ సెన్సో రెన్యూరల్ హియరింగ్ లాస్ అనే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి చెవిలోని నాడీ వ్యవస్థను దెబ్బతీసింది. దీని కారణంగా ఒక్కసారిగా ఒత్తిడిలో మార్పు వచ్చి ఇన్ఫెక్షన్ కు గురైంది. ఇలాగే చాలామంది పరిస్థితి కూడా ఉంటుంది. కానీ వారు వాతావరణం మార్పు అని అనుకుంటారు.
అయితే ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే విమానంలో ప్రయాణం చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. విమానం పైకి ఎగిరేటప్పుడు లేదా ల్యాండ్ అయ్యే సమయంలో చూయింగ్ గమ్ నమనడం లేదా నీరు తాగడం లేదా నోరు తెరిచి గాలిని మింగడం వంటివి చేయాలి. అయితే ఇవేవీ చేయకుండా చెవులు బ్లాక్ అయ్యాయని అనిపిస్తే శ్వాస అడ్డుకొని ఒత్తిడి చేయకూడదు. నేలపై కూడా తరచూ ప్రయాణాలు చేసే వారిలో ఇటువంటి సమస్యలు ఉంటాయి. అయితే ప్రతిసారి వీటిపై ఆధారపడకుండా చెవి వైద్య నిపుణులు సంప్రదించాలి.