Sasa Sasa Video Song: బుల్లితెర యాంకర్ గా ఒక వెలుగు వెలిగిన అనసూయ(Anasuya Bharadwaj) కి యూత్ ఆడియన్స్ ఉన్న క్రేజ్ మామూలుది కాదు. జబర్దస్త్ షో తో యాంకర్ మొదలైన ఆమె కెరీర్, ఇప్పుడు ఏ రేంజ్ లో ఉందో మనమంతా చూస్తూనే ఉన్నాం. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా లెవెల్ లో మంచి బిజీ క్యారక్టర్ ఆర్టిస్టు గా మారింది. అప్పుడప్పుడు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ, మధ్యలో విలన్ క్యారెక్టర్స్ చేస్తూ, కెరీర్ ని నెట్టుకొస్తోంది. అయితే అనసూయ ఇన్నేళ్ల సినీ కెరీర్ లో ఇప్పటి వరకు రొమాంటిక్ యాంగిల్ లో ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కనీసం ఒక పాటలో కూడా ఆమె రొమాన్స్ చేసిన దాఖలాలు అలాంటి. అలాంటి అనసూయ ఇప్పుడు ప్రముఖ కొరియోగ్రాఫర్/ హీరో ప్రభుదేవా తో కలిసి చేసిన రొమాంటిక్ వీడియో సాంగ్ ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది.
వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం ప్రభుదేవా(Prabhu deva) తమిళం లో ‘వోల్ఫ్'(Wolf Movie) అనే చిత్రం చేస్తున్నాడు. ఇందులో అనసూయతో పాటు లక్ష్మీ రాయ్ కూడా హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం లోని ‘సాసా..సాసా’ వీడియో సాంగ్ ని కాసేపటి క్రితమే విడుదల చేశారు. ఈ పాటలో ప్రభుదేవా తో అనసూయ, లక్ష్మి రాయ్ మరియు అంజు చేసిన హాట్ రొమాన్స్ చూస్తే ఎవరికైనా మెంటలెక్కిపోవాల్సిందే. అనసూయ ని ఇంతటి గ్లామర్ రోల్ లో, అది కూడా రొమాంటిక్ రోల్ లో ఇప్పటి వరకు ఆడియన్స్ చూడలేదు. ప్రభుదేవా లాంటి స్టార్ పక్కన ఛాన్స్ రావడం తో ఎలాంటి లిమిట్స్ పెట్టకుండా ఈ సినిమా చేసేందుకు అంగీకారం తెలిపి ఉండొచ్చని అంటున్నారు విశ్లేషకులు. సోషల్ మీడియా లో ఈ వీడియో ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతోంది. సోషల్ మీడియా లో మొదటి నుండి కాస్త అనసూయ కి నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది.
ఆ నెగిటివిటీ ని తట్టుకోలేకనే ఆమె ట్విట్టర్ నుండి తప్పుకుంది. తనపై ట్రోల్స్ వేసే వాళ్లపై ఈమె పోలీస్ కేసులు పెట్టిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అయినప్పటికీ ఆమె సోషల్ మీడియా ని వదల్లేదు. ట్విట్టర్ ని అయితే ప్రస్తుతం ఉపయోగించడం లేదు కానీ, ఇన్ స్టాగ్రామ్ మరియు ఫేస్ బుక్ లో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. ఇకపోతే సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తున్న ఈ పాటని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.
