Potatoes : ఆలు టమాటా, ఆలు పరోట, ఆలు స్పెషల్ ఏం చేయాలన్నా చాలా మంది ముందు ఉడకబెట్టిన తర్వాత వండుతారు. ఇలా ఉడకబెట్టడం వల్ల టేస్ట్ తో పాటు పని కూడా ఫాస్ట్ గా అవుతుంది. లేదంటే కూర వండటానికి చాలా సమయం పడుతుంది. కొన్ని సార్లు ఆలును ఉడకబెట్టకుండా స్పెషల్ కూడా చేయలేరు. పరాటా వంటివి చేయాలంటే మస్ట్ గా ఆలు ఉడకాల్సిందే. కానీ ఇది చాలా సమయం తీసుకుంటుందా? మీకు విసుగు వచ్చిందా? గ్యాస్ వేస్ట్ అవుతుంది అనిపిస్తుందా? జస్ట్ ఈ టిప్స్ పాటించండి చాలు ఆలు 5 ని.ల్లో ఉడికిపోతుంది.
1. ఒక కుండలో ఉడకబెట్టండి: బంగాళాదుంపలను ఒక కుండలో వేయాలి. అంటే కుండలో వేసి పక్కన పెట్టడం కాదండోయ్. కుండలో వేసి నీరు, ఉప్పు కలపాలి. అవి ఫోర్క్-టెండర్‌గా అనిపించే వరకు ఉడకబెట్టండి. ఇక ఇలా ఉడకడానికి ఎక్కువ సమయం పట్టదు. కానీ మూత పెట్టడం మర్చిపోవద్దే. మూత పెట్టడం వల్ల ఏ కూరగాయలు అయినా సరే త్వరగా ఉడుకుతాయి.
2. ప్రెజర్ కుక్: గంజులో వేసి ఉడకబెట్టడ కంటే తరిగిన బంగాళాదుంపలను ప్రెజర్ కుక్కర్‌లో నీటితో ఉడికించాలి. అయితే డైరెక్ట్ గా వేయడం కంటే రెండు ముక్కలుగా కట్ చేసి ఉడకబెట్టడం వల్ల చాలా త్వరగా ఉడుకుతాయి. 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉంచితే సరిపోతుంది. ఆ తర్వాత ఆవిరి పోయాక మీకు నచ్చిన వంటకం చేసుకోవచ్చు.
3. మైక్రోవేవ్: ఇక చాలా మంది వంటింట్లో ఇప్పుడు మైక్రోవేవ్ కామన్ గా ఉంటుంది. సేఫ్ గిన్నెలో బంగాళాదుంపలు తీసుకోని అందులో కాస్త వాటర్ పోసి ఉంచాలి. కవర్ మస్ట్. 5-7 నిమిషాల పాటు మైక్రోవేవ్‌ను హై లెవెల్‌లో ఉంచితే చాలా మెత్తగా ఉడికిపోతాయి బంగాళదుంపలు.
4. ఆవిరి: బంగాళాదుంపలను వేడినీటిపై స్టీమర్ బుట్టలో ఉంచవచ్చు. మెత్తగా అయ్యే వరకు 15-20 నిమిషాలు మూత పెట్టి ఆవిరి మీద ఉడికించాలి. దీని వల్ల కూడా త్వరగా ఉడికిపోతాయి. కానీ మిగిలిన పద్ధతుల కంటే కాస్త ఎక్కువ సమయం తీసుకుంటుంది. బట్ ఇతర వంటకాలు చేస్తూ కూడా దీన్ని ఉడికించవచ్చు. ఈ పద్ధతి పోషకాలను సంరక్షిస్తుంది. రుచిని పెంచుతుంది.
5. ఇన్ స్టాంట్ పాట్: ఇన్ స్టాంట్ పాట్ లో బంగాళ దుంపలు వేసి అందులో కాస్త నీటిని యాడ్ చేయాలి. అధిక పీడనం మీద 4-8 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. మీరు వాటిని గట్టిగా కోరుకుంటే, త్వరగా ఆవిరిని బయటకు పంపేయండి. మృదువుగా అంటే మెత్తగా కావాలి అనుకుంటే ఆవిరి పోయే వరకు అలాగే వదిలేయండి.