Post Office Scheme: మనలో చాలామంది సంపాదించే మొత్తంలో కొంత మొత్తం పొదుపు చేయాలని అనుకుంటారు. డబ్బుకు భద్రత ఉండటంతో పాటు మంచి రిటర్న్స్ పొందాలని ఎక్కువమంది భావిస్తారు. నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ ద్వారా రోజుకు కేవలం 100 రూపాయలు పొదుపు చేస్తే ఐదు సంవత్సరాలలో 20 లక్షల రూపాయల వరకు సంపాదించే ఛాన్స్ ఉంటుంది. ఈ స్కీమ్ స్థిర ఆదాయ పెట్టుబడి స్కీమ్ కాగా ఈ స్కీమ్ ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ను పొందవచ్చు.

ఈ స్కీమ్ లో ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తే భారీగా లాభాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఎలాంటి భయం లేకుండా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు. రిస్క్ లేని ఇన్వెస్ట్ మెంట్ వల్ల కుటుంబ భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాలను సులువుగా చేరుకోవడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ మెచ్యూరిటీ పీరియడ్ 5 సంవత్సరాలు కాగా సంవత్సరం తర్వాత కొన్ని షరతులతో డబ్బులను విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.
త్రైమాసికం ప్రారంభంలో నిర్ణయించే వడ్డీరేట్ల ప్రకారం ఈ పథకం ద్వారా వడ్డీ పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రస్తుతం ఈ స్కీమ్ పై 6.8 శాతం వడ్డీ అమలవుతుండగా ఈ స్కీమ్ ద్వారా లక్షన్నర రూపాయల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. నెలకు కేవలం 100 రూపాయలతో ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ మెంట్ ను మొదలుపెట్టవచ్చు.
5 సంవత్సరాలలో 15 లక్షల రూపాయలు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే 20.85 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. సమీపంలోని పోస్టాఫీస్ బ్రాంచ్ ద్వారా నేషనల్ సేవింగ్స్ స్కీమ్ పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే ఉంటుంది.