Permanent Work From Home: కరోనా తరువాత చాలా కంపెనీల వర్క్ ఫ్రం హోం ను నిలిపివేశారు. కానీ ఇంటి వాతవరణానికి అలవాటు పడిన చాలా మంది ఉద్యోగులు ఇదే బాగుంది అన్నట్లు వ్యవహరిస్తున్నారు. కొన్ని ప్రముక కంపెనీలు కార్యాలయాలకు రావాలని ఫోర్స్ చేస్తున్నా.. ఉద్యోగులు మాత్రం ఇంటి నుంచే పనిచేస్తామని అంటున్నారు. అయితే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో చేసేదేమీ లేక ఉద్యోగులు కార్యాలయాల బాట పడుతున్నారు. అయితే ప్రపచంలోకి 10 ప్రముక కంపెనీలు మాత్రం వర్క్ ఫ్రం హోంకే ప్రిఫరెన్స్ ఇస్తున్నాయి. వారానికి కొన్ని రోజులు కార్యాలయాలకు వస్తే చాలు.. మిగతా రోజుల్లో ఇంటి నుంచే పనిచేయొచ్చని అంటున్నారు. ఆ 10 కంపెనీల జాబితా ఏంటో చూద్దాం.

టీసీఎస్, విప్రో:
భారతదేశంలోని ఈ ప్రముఖ కంపెనీలు ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం విధానాన్ని ఇంకా అవలంభిస్తున్నాయి. అయితే వారానికి కనీసం మూడుసార్లు కార్యాలయాల్లో కనిపించాలని ఆదేశించాయి.
ట్విట్టర్:
వర్క్ ఫ్రం హోం గురించి ట్విట్టర్ యాజమాన్యం ముందే ప్రకటించింది. ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ ‘మీరు ఎక్కడ పనిచేసినా సురక్షితంగా కంప్లీట్ చేయాలి. అలాగే ఈవెంట్స్, వర్క్స్ కంపేర్ చేస్తూ సమయానుకూలంగా వర్క్ చేయాలి’ అని ట్వీట్ చేశారు.
టాటా స్టీల్:
2020 నవంబర్ నుంచి టాటా స్టీల్ కంపెనీ వర్క్ ఫ్రం హోం ను ఎంచుకుంది. దీనికి ‘ఎజైల్ వర్కింగ్ మోడల్’ అని ప్రత్యేకంగా పేరు కూడా పెట్టారు. ఇప్పుడు కూడా చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు.
స్విగ్గీ:
స్విగ్గీ ఉద్యోగులు ఎక్కిడినుంచైనా పనిచేయొచ్చని ముందే ప్రకటించింది. అయితే ఉద్యోగులు ఎక్కడ ఉన్నా రిమోట్ కంట్రోల్ కిందికే వస్తారు. ఎప్పటికప్పుడు వారి వర్క్ డిటేయిల్స్ ఆన్ లైన్లో నమోదవుతూ ఉంటాయి. అయితే ప్రతీ త్రైమాసికానికి బేస్ లోకేషన్లో సమావేశమవుతారు.
స్ఫూటీ:
2021 ఫిబ్రవరి 14న స్ఫూటీ కొత్త పాలసీ తీసుకొచ్చింది. స్వీడిష్ ఆడియో స్ట్రీమింగ్ కంపెనీ ఇకపై పనికోసం ఎవరూ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని తెలపింది.
సాప్:
ప్రపంచంలోని లక్ష మంది ఉద్యోగుల కోసం సాప్ ప్రత్యేకంగా సాప్ట్ వేర్ ను రూపొందించింది. దీని ద్వారా అందరూ ఇంటి నుంచే వర్క్ చేస్తారు.
ఫుజిట్సు:
కరోనా కారణంగా ఈ కంపెనీ జపాన్ లోని తన కార్యాలయాల స్థలాన్ని సగానికి తగ్గించుకుంది. అంటే ‘వర్క్ లైఫ్ షిప్ట్’ కార్యక్రమంలో ద్వారా దేశంలోని 80 వేల మందికి ఇంటి నుంచి పనిచేయడానికి అవకాశం ఇచ్చింది.
అట్లాసియిస్:
ఆస్ట్రేలియాకు చెందిన ఈ టెక్ దిగ్గజం తన ఉద్యోగులను ఎక్కడి నుంచైనా పనిచేయడానికి అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. అయితే కొత్త ‘టీమ్ ఎనీవేర్’ ప్రకారం ఉద్యోగులు సంవత్సరానికి 4 సార్లు కార్యాయానికి రావాలి.

అవేబర్:
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్ష కంటే ఎక్కువ వ్యాపార క్లయింట్లతో ఈమెయిన్ మార్కెటింగ్ సర్వీస్ ప్రొవైడర్ పూర్తిగా రిమోటస్ కంట్రోల్ ద్వారా వర్క్ ఫ్రం హోం నిర్వహిస్తోంది.
అక్వౌంట్:
గత సంవత్సరం ప్రారంభంలో లాస్ ఏంజిల్స్, న్యూ పోర్ట్ బీచ్, శాన్ డియాగో, శాన్ ప్రాన్సిస్కో, సిలికాన్ వ్యాలీల్లోని తన కార్యాలయాల ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ప్రకటించింది.
3ఎం:
ఈ కంపెనీ మొత్తం వర్క్ ఫ్రం హోం ప్రకటించింది.
ఇలా కంపెనీలన్నీ కరోనా కాలంలో కొనసాగించిన వర్క్ ఫ్రం హోంను పర్మనెంట్ చేశాయి. దీనివల్ల ఉద్యోగులకు ఇంటి నుంచే పని అలవాటు కావడం.. సంస్థకు నిర్వహణ ఖర్చులు కలిసిరావడం సాగుతోంది. ఆఫీసుల్లో ఐదారుగంటలు చేసే ఉద్యోగులు ఇంటి వద్ద 8 నుంచి 10 గంటలు పనిచేస్తున్నారు. ఇదే వర్క్ ఫ్రం హోంను కంటిన్యూ చేయడానికి కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇక ఉద్యోగులు కూడా ఆఫీసులకు రాము అని.. ఇంటి నుంచే పనిచేస్తామని చెబుతుండడంతో కంపెనీలు కూడా ఉద్యోగుల నిర్ణయానికే ఓటు వేస్తున్నాయి. ఈ పద్ధతిని కొనసాగిస్తున్నాయి.