Parenting Tips: చాలామంది తల్లిదండ్రులు పిల్లల పెంపకం విషయంలో తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల తాత్కాలికంగా ఎటువంటి సమస్య ఉండదు. కానీ భవిష్యత్తులో ఈ ప్రభావం వారి మెదడుపై పడి వారిలో నెగటివ్ ఆలోచనలు రేకెత్తిస్తాయి. దీంతో ఇతరులపై వారికి అప నమ్మకం పడి కొన్ని పనులు చేయడానికి ముందుకు రారు. అంతేకాకుండా వారు ఇతరులపై నెగటివ్ దృష్టితో చూడడంతో వారు కూడా వీరితో సంబంధాలు కొనసాగించడానికి ఇష్టపడరు. అంటే ఇక్కడ ఎవరు ఏ తప్పు చేయకపోయినా పిల్లలు మాత్రం నష్టపోతారు. ముఖ్యంగా నేటి కాలం పిల్లలు అయితే తల్లిదండ్రుల మాటలను, ప్రవర్తనపై బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. అసలు పిల్లలు ఉన్నప్పుడు ఎటువంటి మాటలు మాట్లాడొద్దు ఇప్పుడు చూద్దాం..
ఇతరులపై నెగటివ్:
కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు ఉన్న సమయంలో ఇతరుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ వ్యక్తి అసలు మంచివాడు కాదని.. అతనితో ఎలాంటి సంబంధాలు ఉండకూడదు అని.. అతను చాలా మోసం చేశాడని.. ఇంకెప్పుడూ అతనితో కలిసి ఉండవద్దని.. అతని క్యారెక్టర్ చాలా బ్యాడ్ అని.. అంటూ ఉంటారు. వాస్తవానికి అవతలి పర్సన్ క్యారెక్టర్ బ్యాడే కావచ్చు. కానీ ఈ విషయాన్ని పిల్లల ముందు చర్చించుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇలా చర్చించుకున్న తర్వాత పిల్లలు వారి గురించి చెడుగా ఊహించుకుంటారు. అనుకోకుండా వారు ఎప్పుడైనా కలిస్తే వారితో నెగిటివ్ గానే ప్రవర్తిస్తారు. వాస్తవానికి తల్లిదండ్రులు ఇతరులతో గొడవ పడినప్పుడు పిల్లలు కలిసిపోతూ ఉండాలి. అలా ఉంటేనే పాజిటివ్ వాతావరణ ఉంటుంది.
ఆర్థిక విషయాలు:
చాలామంది తల్లిదండ్రులు పిల్లల ఎదుట డబ్బు విషయం గురించి బాగా మాట్లాడుతుంటారు. డబ్బు ఎలా పెంపొందించాలి? ఎలా ఖర్చు పెట్టాలి? అన్న దానికంటే దీనికి ఎందుకు ఖర్చు పెట్టావు? ఈ అనవసరమైన ఖర్చు? అంటూ డబ్బు విషయంలో ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఈ పరిస్థితిని చూసిన పిల్లలు తమకు ఏదైనా డబ్బు అవసరం పడినప్పుడు వారు అడగడానికి భయపడుతూ ఉంటారు. దీంతో కొన్ని విషయాల్లో వారు వెనుకడుగు వేయడానికి ఆస్కారం ఉంటుంది. భవిష్యత్తులో వారికి ఏ రకంగా నైనా డబ్బు అవసరం ఉంటుంది. అయితే ముందే వారిలో ఈ నెగిటివ్ ఆలోచన ఉంటే డబ్బు అడగడానికి ఇష్టపడరు.
పిల్లల భవిష్యత్తు:
సాధారణంగా విద్యార్థులు 8 నుంచి 9 వ తరగతి వచ్చేసరికి వారి భవిష్యత్తు ప్లాన్లను తల్లిదండ్రులు చర్చించుకుంటూ ఉంటారు. అయితే ఈ విషయంలో పిల్లలను చేర్చడం మంచిది. వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి? వారు ఏ విధంగా చదవగలుగుతున్నారు? వారికి భవిష్యత్తులో ఎలాంటి చదువు అవసరం ఉంటుంది? అనే విషయాలపై చర్చిస్తే పర్వాలేదు. కానీ తల్లిదండ్రులు తమకు నచ్చిన చదువు మాత్రమే చేయాలని.. వారికి నచ్చిన విద్యాసంస్థల్లో వేయాలని అనుకుంటూ ఉంటారు. ఇలా వారిలో వారు గొడవ పడుతూ ఉంటే విద్యార్థులు అయోమయానికి గురై ఎవరికి మద్దతు ఇవ్వాలో అర్థం కాకుండా ఉంటారు. అలా ఒకరిని కాదని మరొకరికి మద్దతుకి ఇస్తే తల్లిదండ్రులు, పిల్లల మధ్య గ్యాబ్ ఏర్పడే అవకాశం ఉంటుంది.