Parenting Tips: ప్రస్తుత కాలంలో కొంతమంది పిల్లలు వింతగా ప్రవర్తిస్తున్నారు. వారిలో ఉండే మానసిక సమస్యలే అందుకు కారణమని కొందరు నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇలా తయారు కావడానికి ప్రధానంగా తల్లిదండ్రులే అని అంటున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పెంచడంలో చేసే పొరపాటు వలన పిల్లల్లో మానసికంగా సమస్యలు ఎదురై వారి ప్రవర్తనలో కూడా తేడా ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా వారి మెదడులో ఏమిండాలా అనే సమస్యతో వారు తీవ్రంగా స్ట్రెస్ కు గురై చేసే పనులపై ప్రభావం పడుతుంది. అంతేకాకుండా శారీరకంగా కూడా వారి ఎదుగుదలలో ఇబ్బందులు ఉంటాయి. అసలు ఈ ఏమిండాలా అనేది ఎప్పుడు ఏర్పడుతుంది? ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర ప్రధానమైనది. వీరు ఏ విషయాలను అయినా ముందుగా తల్లిదండ్రుల ద్వారా తెలుసుకుంటారు. అలాగే తల్లిదండ్రుల ప్రవర్తన కారణంగా పిల్లల్లో మార్పులు వస్తుంటాయి. ప్రస్తుత కాలంలో చాలామంది తల్లిదండ్రులు ఉద్యోగ, వ్యాపార రీత్యా బిజీగా మారిపోతున్నారు. దీంతో పిల్లలను పెద్దగా పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా వారికి ఉన్న ఒత్తిడిని పిల్లలపై చూపిస్తున్నారు. కొన్నిసార్లు పిల్లలు తమకు ఉన్న సమస్యలను తెలుపుతూ ఉంటారు. ఉదాహరణకు తనకు హోంవర్క్ రాయలేదని అనిపించడం.. నిద్రలో కలలు వస్తున్నాయని చెప్పడం.. పాఠశాలల్లో ఉన్న సమస్యలను చెబుతూ ఉంటారు. అయితే చాలామంది తల్లిదండ్రులు ఈ సమస్యలను పెద్దగా పట్టించుకోరు. అంతేకాకుండా వారిని ఇతరులతో పోలుస్తూ.. ఎప్పటికీ నిందిస్తూ ఉంటారు. దీంతో వారిలో ఏమిండాలా అనేది ఏర్పడుతుంది. ఇది ఒక భయంకరమైన మానసిక జబ్బు అనుకోవచ్చు. ఎందుకంటే పిల్లలకు ఏదైనా సమస్య ఏర్పడితే తల్లిదండ్రుల మధ్య చెప్పుకోకుండా భయపడుతూ ఉంటారు. అటు బయట కూడా ఇతరులకు చెప్పుకోలేక మానసికంగా ఇబ్బందులకు గురవుతారు. ఈ విధంగా వారు తీవ్రమైన ఒత్తిడిని కలిగి శారీరకంగా కూడా ఎదగలేక పోతుంటారు.
పిల్లల మెదడులో ఏమిండాలా అనే భయం ఏర్పడిన తర్వాత Cortisol అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ వల్ల పిల్లలు అకస్మాత్తుగా ఏడవడం.. అనుకోకుండా కోపాన్ని తెచ్చుకోవడం.. కేకలు వేయడం.. చెప్పిన మాట వినకపోవడం.. శారీరకంగా బిగిసిపోయి ఉన్నట్లు కనిపించడం.. ప్రతి విషయాన్ని భయంతో చూడడం వంటి లక్షణాలు ఏర్పడతాయి. ఈ లక్షణాలు ఎప్పటికీ అలాగే ఉంటే వారి జీవితం పై ప్రభావం పడి ఏ పని సక్రమంగా నిర్వర్తించలేక పోతారు. అంతేకాకుండా వారు ఏదైనా సమస్య ఉంటే తల్లిదండ్రులకు చెప్పలేక పోతారు. ఇలా వారిలోనే కుమిలిపోయి తీవ్రమైన వేదనకు గురవుతారు.
అందువల్ల తల్లిదండ్రులు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని మానసిక నిపుణులు తెలుపుతున్నారు. పిల్లలు ఏ విషయాన్ని చెప్పినా శ్రద్ధగా వినాలి. ఆ తర్వాత వాటికి సమాధానం తెలిస్తే చెప్పాలి. లేకపోతే వాటికి సొల్యూషన్ చూపించాలి. ముఖ్యంగా స్కూల్ పిల్లలు పాఠశాల నుంచి రాగానే వారికి ఏదైనా చెప్పాలని అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో కొందరు తల్లిదండ్రులు పట్టించుకోరు. కానీ ఇలాంటి సమయంలో వారి విషయాలను పూర్తిగా వింటే వారికి తమ సమస్యలు వినేవారు ఉన్నారని అర్థమవుతుంది. అప్పుడు వారు ఏ విషయానైనా ఓపెన్ గా ఉంటారు.