https://oktelugu.com/

PAN Card: పాన్ కార్డు పోయిందా? అయితే కంగారుపడకుండా ఇలా చేయండి

పాన్ కోర్డు కోసం స్థానిక ఏజెన్సీల వద్దకు వెళ్తే నిజ ధర కంటే పది రెట్లు ఎక్కువగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే పాన్ కార్డు కోసం సుమారు రూ.300 నుంచి రూ. 500 వరకు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : February 28, 2024 / 06:43 PM IST

    PAN Card

    Follow us on

    PAN Card: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి పాన్ కార్డు తప్పనిసరి. ఈ మధ్య పాన్ కార్డు లేనిది చాలా పనులు కూడా జరగడం లేదని చెప్పుకోవాలి. పాన్ కార్డు అనేది ఆదాయపు పన్ను రిటర్న్ లను ఫైల్ చేయడానికి ప్రధానం గా ఉపయోగపడుతుంది. ఆర్థిక లావాదేవీలు జరిగే ప్రతి చోట దీని వాడకం ఉంటుంది. అంతేకాదు బ్యాంకు ఖాతాను ఓపెన్ చేయాలన్న పాన్ కార్డు తప్పనిసరి.

    అయితే పాన్ కార్డును ఎక్కువగా వినియోగించడం వలన విరిగిపోవడం కానీ, పాడై పోవడం కానీ జరుగుతుంది. మరి కొన్ని సమయాల్లో పాన్ కార్డు ఎక్కడైనా పెట్టి మర్చిపోవడం, పొగొట్టుకోవడం జరుగుతుంది. అలాంటి సమయాల్లో మనం ఎంతో కంగారు పడిపోతుంటాం. అయితే ఇకపై అలా కంగారు పడాల్సిన పని లేదు. సులభంగా పాన్ కార్డు రీప్రింట్ ను పొందవచ్చు. అది కూడా ఇంటిలో ఉండే. అది ఎలా అనుకుంటున్నారా?..

    పాన్ కోర్డు కోసం స్థానిక ఏజెన్సీల వద్దకు వెళ్తే నిజ ధర కంటే పది రెట్లు ఎక్కువగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే పాన్ కార్డు కోసం సుమారు రూ.300 నుంచి రూ. 500 వరకు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే నిజానికి దీని ధర రూ.50 మాత్రమే. అవును మీరు వింటున్నది నిజమే.. ఇంటిలో ఉండి కేవలం రూ.50 చెల్లించి పాన్ కార్డు మళ్లీ పొందవచ్చు.

    ముందుగా గూగుల్ కు వెళ్లి రీప్రింట్ పాన్ కార్డును సెర్చ్ చేయాలి.. అక్కడ కనిపించే ఎన్ఎస్డీఎల్ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి. తరువాత పాన్ కార్డు నంబర్, ఆధార్ కార్డు నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వంటి వివరాలను నమోదు చేయాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేసి కాప్చా కోడ్ ను ఎంటర్ చేయాలి. వెంటనే అక్కడ మీ డిటైల్స్ వస్తాయి. వాటిని వెరిఫై చేసుకుని ఓటీపీ మీద క్లిక్ చేయాలి. వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయగానే రూ.50 చెల్లించాలి.. పేమెంట్ చెల్లింపు తరువాత వారం రోజుల్లో పాన్ కార్డు రీప్రింట్ పోస్టులో ఇంటి వద్దకే వస్తుంది.