Oversleeping: ముంచుకొస్తున్న నిద్ర మంచిది కాదు..!

మనిషి ఆరోగ్యానికి నిద్ర తప్పనిసరి. రోజులో కనీస నిద్ర చేయకపోతే నీరసంగా ఉంటుంది. నిద్రకరువైన వారు అనేక అనారోగ్యాల బారిన పడుతారు. కొందరు నిద్ర విషయంలో చాలా నిర్లక్ష్యం చేస్తారు.

Written By: Srinivas, Updated On : December 11, 2023 6:39 pm

Oversleeping

Follow us on

Oversleeping: ప్రతిరోజు 24 గంటల సమయం ఉంటుంది. ఇందులో మనుషులు 12 గంటల పాటు పనిచేసి మిగతా సమయానికి విశ్రాంతి తీసుకుంటారు. ఇందులో కొంత సమయం నిద్రపోతుంటారు. శరీరం ఆరోగ్యంగా ఉండడానికి నిద్ర తప్పనిసరి. కానీ కొందరు విధుల కారణంగా సరిగా నిద్రపోరు. రోజులో కనీసం 6 గంటలు నిద్రపోతే చాలాని కొందరు అంటున్నారు. కానీ కనీసం 7 నుంచి 8 గంటలు పడుకుంటేనే ఆరోగ్యం అని కొన్ని పరిశోధనలో తేలుతుంది. ఇక రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోనివారు మధ్యాహ్నం పడుకుంటారు. కొందరికి పగలు నిద్ర ముంచుకొస్తుంది. మాట్లాడుతుండగానే నిద్రపోతుంటారు. కానీ ఈ పరిస్థితి అంత మంచిది కాదని అంటున్నారు. ఎందుకంటే?

మనిషి ఆరోగ్యానికి నిద్ర తప్పనిసరి. రోజులో కనీస నిద్ర చేయకపోతే నీరసంగా ఉంటుంది. నిద్రకరువైన వారు అనేక అనారోగ్యాల బారిన పడుతారు. కొందరు నిద్ర విషయంలో చాలా నిర్లక్ష్యం చేస్తారు. రాత్రిళ్లు మెళకువగా ఉండి ఉదయం నిద్రపోవచ్చు అని అనుకుంటారు. కానీ ఉదయం ఎన్నిగంటలు నిద్రపోయినా రాత్రిళ్లు పోయే నిద్రను భర్తీ చేయలేరు. అంతేకాకుండా ఉదయం నిద్ర ముంచుకొచ్చేవారికి ఇది ప్రమాదకరమే అని అంటున్నారు.

రాత్రిళ్లు నిద్రపోకుండా ఉదయం నిద్రకు జారుకునేవారికి ఎంత మాత్రం ఆరోగ్యకరం కాదని అంటున్నారు. ఇలాంటి వారిలో ఆనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే పగలు నిద్ర రాగానే వెంటనే కనీసం 30 నిమిషాల పాటు పడుకుంటే ఎటువంటి సమస్యలు రావు. అలాగని కునుకు తీసి సరిపోద్దీ అనుకుంటే సరిపోదు. ఇక మధ్యాహ్నం 3 గంటల లోపు ఎంత సేపు పడుకున్నా ఏమి కాదు. కానీ మధ్యాహ్నం తరువాత అదేపనిగా నిద్రించినా రాత్రిళ్లు నిద్రపట్టడం సమస్యగా మారుతుంది.

కొందరు నిద్రలో గురకపెడుతూ ఉంటారు. రక్త ప్రసరణలో ఇబ్బందులు ఏర్పడితే ఈ సమస్య వస్తుంది. గంటలో కొన్ని సార్లు గురక వల్ల మెళకువ వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. లేకుండా అనారోగ్య బారిన పడే అవకాశం ఉంది. ఇక నిద్రపోవడానికి కొందరు మెలటోనిన్ మాత్రలను వాడుతూ ఉంటారు. ఇది 0.3 మిల్లిగ్రాములు తీసుకుంటే ఎటువంటి ప్రమాదం లేదుు. కానీ అంతకంటే ఎక్కువ డోస్ తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై ప్రభాం చూపొచ్చని అంటున్నారు. ముఖ్యంగా గర్భం దాల్చిన వారు ఈ మాత్రలకు దూరంగా ఉండడమే మంచిదని కొందరు వైద్యులు సూచిస్తున్నారు.