Japan OTT: ఓటీటీలోకి వచ్చేసిన కార్తీ జపాన్.. ఎక్కడ చూడొచ్చంటే!

జపాన్ మూవీ థియేటర్స్ లో విడుదలైన నెల రోజులు అవుతుంది. ఈ క్రమంలో ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. జపాన్ ఓటీటీ హక్కులు ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

Written By: NARESH, Updated On : December 11, 2023 10:29 am

Japan OTT

Follow us on

Japan OTT: కార్తీ లేటెస్ట్ మూవీ జపాన్. నవంబర్ 10న విడుదలైన జపాన్ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. కార్తీ ఈ చిత్రంలో దొంగగా నటించారు. మిక్స్ట్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో నిరాశపరిచింది. ఈ చిత్రానికి రాజు మురుగన్ దర్శకత్వం వహించాడు. సునీల్ కీలక రోల్ చేయగా, అను ఇమ్మానియేల్ జంటగా నటించింది. హిట్ కోసం అల్లాడుతున్న అను ఇమ్మానియేల్ కి జపాన్ తో కూడా ఫలితం దక్కలేదు.

కాగా జపాన్ మూవీ థియేటర్స్ లో విడుదలైన నెల రోజులు అవుతుంది. ఈ క్రమంలో ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. జపాన్ ఓటీటీ హక్కులు ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. జపాన్ డిసెంబర్ 11 నుండి ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. కార్తీ అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి.

కార్తీ 25వ చిత్రంగా జపాన్ విడుదలైంది. ఈ మూవీలో కార్తీ డిఫరెంట్ మేనరిజం ట్రై చేశారు. తమిళంతో సమానంగా తెలుగులో కూడా ప్రోమోట్ చేశారు. ఇంటర్వ్యూలు ఇచ్చారు. జపాన్ విజయం సాధిస్తుందని కార్తీ గట్టిగా నమ్మారు. జపాన్ కథ ఏమిటంటే… కార్తీ ఒక పెద్ద దొంగ. స్కెచ్ వేస్తే ఫెయిల్ కాదు. ఈ దొంగ వద్ద పోలీసులు దోపిడీ చేసిన వీడియోలు ఉంటాయి. దాంతో కార్తీ పోలీసులకు టార్గెట్ అవుతాడు.

కార్తీని పట్టుకుని వీడియోలు స్వాధీనం చేసుకోవాలని పోలీస్ అధికారి సునీల్ తో పాటు మరికొందరు వెతుకుతూ ఉంటారు. ఈ క్రమంలో నగరంలో రూ. 200 కోట్ల విలువైన బంగారు నగలు దుకాణం నుండి దొంగిలించబడతాయి. ఈ దొంగతనం చేసింది కార్తీనే అని పోలీసులు భావిస్తున్నారు. ఆ దొంగతనం చేసింది ఎవరు? నిజంగా కార్తీ హస్తం ఉందా? అనేది కథలో మలుపు.