
Business Opportunity: సాధారణ కలపతో పోలిస్తే టేకు కలప ఖరీదు ఎక్కువనే సంగతి తెలిసిందే. వాణిజ్యపరంగా టేకు కలపకు డిమాండ్ ఎక్కువగా ఉండటం గమనార్హం. విలువైన ఫర్నిఛర్ లను తయారు చేయడానికి, ఓడలను, రైల్వే కోచ్ లను తయారు చేయడానికి టేకు కలపను వినియోగిస్తారు. ప్రత్యేకమైన లక్షణాలు ఉండటం వల్ల ఈ టేకు కలపకు డిమాండ్ ఊహించని స్థాయిలో ఉంటుంది. టేకు కలప చెట్టు జీవితకాలం 200 సంవత్సరాలు.
టేకు కలపలో చెద పురుగులు అస్సలు ఉండవు. ఔషధాల తయారీలో సైతం టేకు కలపను వినియోగించడం జరుగుతుంది. టేకు సాగు చేయడం ద్వారా సులభంగా లక్షల్లో సంపాదించే అవకాశం అయితే ఉంటుంది. గోదావరి టేకు, నీలాంబర్ టేకు, అదిలాబాద్ టేకు, పశ్చిమ ఆఫ్రికా టేకు, మధ్య అమెరికా టేకు ఇలా వేర్వేరు టేకులు ఉన్నాయి. ఈ టేకులలో ఒక్కో టేకు ఒక్కో విధంగా ఉంటుంది.
టేకు కలపను సాగు చేయాలని భావిస్తే మొదట పొలాన్ని దున్నటంతో పాటు పాత పంటకు సంబంధించిన అవశేషాలను పూర్తిగా తొలగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒకటిన్నర అడుగుల లోతు, రెండున్నర అడుగుల వెడల్పు ఉన్న గుంతలను సిద్ధం చేయాల్సి ఉంటుంది. సాధారణ పంటల సాగుతో పోలిస్తే టేకు సాగుకు ఎక్కువ మొత్తంలో ఎరువులను వినియోగించాల్సి ఉంటుంది. టేకు మొక్కలను నాటడానికి నెలరోజుల ముందు ఆవుపేడను కలిపి మట్టిలో చల్లాలి.
కనీసం రెండు సంవత్సరాల వయస్సు ఉన్న మొక్కలను మాత్రమే నాటాల్సి ఉంటుంది. రెండు సంవత్సరాల మొక్క అయితే మాత్రమే బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. రైతులు టేకు సాగుపై దృష్టి పెడితే సులువుగా లక్షల్లో లాభాలను సొంతం చేసుకోవచ్చు. పాత పంట అవశేషాలను తొలగించకుండా, ఎరువులు ఎక్కువగా వినియోగించకుండా టేకు సాగు చేస్తే నష్టాలు వచ్చే ఛాన్స్ ఉంది.