MAA Election: మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మా సభ్యత్వానికి రాజీనామా చేశారు ప్రకాష్ రాజ్. అయితే తాను రాజీనామా చేయడం వెనక గల కారణాలను త్వరలోనే తెలియజేయనున్నట్లు ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. ‘మా’కు(ప్యానెల్) మద్దతుగా నిలబడిన సభ్యులందరికి నమస్కారం. మా సభ్యత్వానికి నేను రాజీనామా చేయడం వెనక అర్థం ఉంది. త్వరలోనే అన్నింటినీ వివరిస్తా అంటూ పేర్కొన్నారు.

‘మా’ అధ్యక్ష పదవికి మంచు విష్ణుతో పోటీపడగా.. మొత్తం 18 కార్యవర్గ సభ్యుల్లో 10 మంది విష్ణు ప్యానెల్‌కు చెందిన అభ్యర్థులు గెలుపొందారు. 8 మంది ప్రకాష్ రాజ్ అభ్యర్థులు విజయం సాధించారు. ఫలితాల అనంతరం ప్రకాశ్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రాంతీయవాదం, జాతీయ వాదం నేపథ్యంలోనే ఈ ఎన్నికలు జరిగినట్లు చెబుతూ విష్ణు గెలుపును స్వాగతించారు.
ఈ క్రమంలోనే మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు ప్రకాష్ రాజ్ ప్రకటనపై మంచు విష్ణు స్పందించారు. అధ్యక్షుడిగా తాను ప్రకాష్ రాజ్ రాజీనామాని అంగీకరించనని విష్ణు స్పష్టం చేశారు