Custard apple cultivation: తినడానికి తియ్యగా, రుచికరంగా ఉండే పండ్లలో సీతాఫలం ఒకటనే సంగతి తెలిసిందే. ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉన్న సీతాఫలం పండ్లను తినడానికి పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఆసక్తి చూపిస్తారు. తేలికపాటి నేలల్లో సాగు చేసే ఈ పంటను పండించడం ద్వారా భారీగా లాభాలను పొందే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తోంది. పొడి వాతావరణం ఉండే ప్రాంతాలలో సీతాఫలంను ఎక్కువగా సాగు చేస్తారు.

కరువు ప్రాంతాల రైతులకు సీతాఫలం పంట సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఆల్కలీన్ నేలలు మాత్రం సీతాఫలం సాగు చేయడానికి అనుకూలమైన నేలలు కాదు. ముముత్, బాలానగర్ జాతులకు చెందిన చెట్లను నాటడం ద్వారా సులువుగా మంచి లాభాలను పొందవచ్చు. కొన్ని రాష్ట్రాలలో ఈ చెట్లను సాగు చేస్తుండటం గమనార్హం. ఎర్ర నేలలు, ఒండ్రు నేలలలో సైతం సీతాఫలంను సాగు చేయవచ్చు.
వర్షాకాలం ప్రారంభం సమయంలో సీతాఫలం మొక్కలను నాటాల్సి ఉంటుంది. వ్యవసాయ అధికారులు సీతాఫలం మొక్కలకు కంపోస్ట్ ఎరువుతో పాటు కుళ్లిన ఎరువును వేయాలని సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా నీరు అందించాల్సిన అవసరం లేకుండానే ఈ పంట సాగు చేయవచ్చు. అయితే మొదటి నాలుగు సంవత్సరాల పాటు నీళ్లు అందించడం వల్ల మొక్క బలంగా పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని సమాచారం.
తక్కువ పెట్టుబడితో సీతాఫలం సాగు ద్వారా ఎక్కువ లాభాలను సొంతం చేసుకోవచ్చు. స్వచ్చమైన వర్షపు నీటిని అందించడం ద్వారా కూడా సీతాఫలం సాగుతో మంచి లాభాలు పొందే అవకాశం అయితే ఉంటుంది.