https://oktelugu.com/

Shani: శని దోషం పోవాలంటే ఈ ఆలయాన్ని సందర్శించండి

ప్రతి గ్రహంలో శని ఏడున్నర సంవత్సరాల కాలం ఉంటాడు. ఆ సమయంలో వారికి అశుభ ఫలితాలు కలిగిస్తుంటాడు. ఈ క్రమంలో వారు శని బాధల నుంచి విముక్తి కావడానికి శనికి సంబంధించిన పూజలు చేస్తే సరి.

Written By: , Updated On : May 1, 2023 / 06:31 PM IST
Follow us on

Shani: మనం జ్యోతిష్య శాస్ర్తాన్ని నమ్ముతాం. దాని ప్రకారమే ముహూర్తాలు చూసుకుని మరీ పనులు చేస్తాం. మంచి సమయం ఉంటేనే ఏ పని అయినా మొదలుపెడతాం. లేదంటే వాయిదా వేస్తాం. కానీ మన జాతకంలో అన్ని గ్రహాలు శుభాలు ఇవ్వాలని లేదు. ఏ గ్రహమైనా కొద్ది రోజులు మంచి కొన్ని రోజులు చెడు ప్రభావాలను కలిగిస్తుంది. శని దేవుడు కూడా కొంత కాలం మంచి కొంత కాలం చెడు ప్రభావాలు కలిగిస్తాడు. ఇందులో భాగంగానే అష్టమ శని, అర్దమ శని అని పిలుస్తుంటారు.

ప్రతి గ్రహంలో శని ఏడున్నర సంవత్సరాల కాలం ఉంటాడు. ఆ సమయంలో వారికి అశుభ ఫలితాలు కలిగిస్తుంటాడు. ఈ క్రమంలో వారు శని బాధల నుంచి విముక్తి కావడానికి శనికి సంబంధించిన పూజలు చేస్తే సరి. దీనికి శని జయంతి రోజు శని దేవుడిని ప్రసన్నం చేసుకుంటే ఇంకా మంచి జరుగుతుందని నమ్ముతారు. దీనికి మనం ఏం చేయాలో తెలుసుకుందాం.

శని జయంతి రోజు ప్రయాగ్ రాజ్ జిల్లాలోని తర్దిహ్ గ్రామంలోని పూల్పూర్ లో శని మహారాజ్ కు ప్రత్యేక దేవాలయం ఉంది. ఇక్కడ శనిజయంతి రోజు పూజలు చేస్తే మన కష్టాలు పటాపంచలు అవుతాయి. దీంతో దేశంలోని పలు రాష్ట్రాల నుంచి ఎంతో మంది భక్తులు విచ్చేస్తుంటారు. ఈ గుడిని సందర్శించడం ద్వారా శని సదా శతి తొలగిపోతుందని విశ్వసిస్తారు.

శని సదశతి సమయంలో అనేక బాధలకు గురిచేస్తుంటాడు. దీని ప్రభావం నుంచి బయటపడటానికి మంత్రాలు, శని దర్శనం ఉపయోగపడుతుంది. శనీశ్వరుడిని పూజించడం వల్ల సదాశతి బాధలు దూరమవుతాయని మనవారి నమ్మకం. దీంతో శనిని సంతోష పెట్టేందుకు ఇలాంటి పూజలు ఉపయోగకరంగా ఉంటాయి.