Gold Loan: కరోనా సమయంలో మనలో చాలామంది బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు తక్కువ వడ్డీకే బంగారంపై రుణాలను అందిస్తున్న నేపథ్యంలో బంగారంపై రుణాలు తీసుకునే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. బంగారంపై వడ్డీరేటు బ్యాంకులను బట్టి 60 పైసల నుంచి 80 పైసల వరకు ఉంది. ప్రైవేట్ ఫైనాన్షియర్లు అయితే బంగారం రుణాలను రూపాయిన్నర వడ్డీకి ఇస్తున్నారు.

అయితే గోల్డ్ లోన్ ను తీసుకున్న వాళ్లు నియమనిబంధనలకు అనుగుణంగా సకాలంలో రుణాలను చెల్లిస్తే మంచిది. ఏదైనా కారణం చేత రుణాలను చెల్లించడంలో ఇబ్బందులు ఎదురైతే మాత్రం ఇబ్బందులు పడక తప్పదు. ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు సకాలంలో రుణాలను చెల్లించని వాళ్ల బంగారాన్ని వేలం వేయడానికి సిద్ధమయ్యాయి. ఎన్‌బీఎఫ్‌సీలు లోన్ ను తిరిగి చెల్లించని వాళ్లకు నోటీసులను పంపుతున్నాయి.
Also Read: కాంగ్రెస్ తో కేసీఆర్? కొత్త పార్టీ దిశగా రేవంత్ రెడ్డి?
గోల్డ్ లోన్ ను తీసుకున్న వాళ్లలో లక్షల సంఖ్యలో డిఫాల్టర్లు ఉన్నారు. ప్రతి నెలా ఎన్‌బీఎఫ్‌సీలు వేలం నిర్వహించి బంగారాన్ని విక్రయిస్తున్నాయి. కరోనా వల్ల లక్షల సంఖ్యలో ప్రజలు ఉద్యోగాలను కోల్పోయారు. ప్రైవేట్ సంస్థలలో పని చేసే చాలామంది గతంలో పొందిన వేతనంతో పోలిస్తే తక్కువ వేతనానికే పని చేస్తున్నారు. అదే సమయంలో అప్పులు పెరగడంతో గోల్డ్ లోన్లపై ఆధారపడుతున్నారు.
గోల్డ్ లోన్లు సెక్యూర్డ్ రుణాలు కాబట్టి బ్యాంకులు సైతం గోల్డ్ లోన్లను మంజూరు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. గోల్డ్ లోన్లకు ఊహించని స్థాయిలో డిమాండ్ పెరిగిందని బ్యాంకులు సైతం చెబుతుండటం గమనార్హం. బంగారం రుణాలను తీసుకున్న వాళ్లు సరైన సమయంలో రుణాలను చెల్లిస్తే ఇబ్బందులు పడే ఛాన్స్ ఉండదు.
Also Read: వన్స్ కేసీఆర్ స్టెప్ ఇన్.. ప్రధాని హిస్టరీ రిపీట్ అవుతుందా?