srireddy and sriram: సినీ నటి శ్రీరెడ్డి గురించి తెలియని ఆడియన్స్ ఉండరు. ఆమె నటించింది కొన్ని సినిమాలే అయినా క్యాస్టింగ్ కౌచ్ పేరిట చేసిన రచ్చ మాములుగా లేదు. సినీ ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లను రకరకాల వేధిస్తున్నారని, కొందరికి అవకాశాలు రాకుండా చేస్తున్నారంటూ అప్పట్లో ఫిల్మ్ ఛాంబర్ ఎదుట చేసిన హల్ చల్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. అప్పటి నుంచి శ్రీరెడ్డి తెలుగు సినిమా నటులే కాకుండా తమిళ సినీ రంగానికి చెందిన కొందరి వ్యవహారాలను బయటపెడుతూ వస్తోంది. అయితే ఆమె చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమేనని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు అన్నారు. కానీ శ్రీరెడ్డి మాత్రం సోషల్ మీడియాలో పరుష వ్యాఖ్యలతో కొందరిపై విరుచుకుపడుతూ వస్తోంది.

కొన్నాళ్లు శ్రీరెడ్డి మీడియాకు దూరంగా ఉంది. దీంతో ఆమె రాజకీయాల్లోకి వస్తోందని ప్రచారం జరిగింది. కానీ ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇవ్వకపోయినా ఏపీ సీఎం జగన్ కు మద్దతు ప్రకటిస్తూ వస్తోంది. జగన్ పై ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే శ్రీరెడ్డి స్పందిస్తోంది. దీంతో ఆమె వైసీపీ లీడర్ అంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కానీ వైసీపీ వర్గం మాత్రం శ్రీ రెడ్డి గురించి ఏ విధంగా స్పందించడం లేదు. అయితే అప్పుడప్పుడు శ్రీరెడ్డి సోషల్ మీడియాలో ఏదో ఒక ఇష్యూతో వార్తల్లో నిలుస్తోంది.
Also Read: యంగ్ హీరోయిన్ తో ఆ హీరో పెళ్లి !
దాదాపు సినీ రంగానికి చెందిన చాలా మంది బండారాన్ని బయటపెట్టిన శ్రీరెడ్డి తాజాగా ఇండియన్ ఐడల్ విన్నర్ శ్రీరామ్ వెంటపడుతోంది. గతంలో శ్రీరామ్ తనతో సన్నిహితంగా ఉన్నాడని శ్రీరెడ్డి అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాకుండా తనతో సంభాషణ జరిపిన వాట్సాప్ చాట్ ను స్క్రీన్ షాట్ తీసి ఆ ఇమేజ్ లను కూడా పోస్టు చేసింది. అయితే శ్రీరెడ్డి శ్రీరామ్ ను రెచ్చగొట్టినట్లు ఉండడంతో కొందరు నెటిజన్లు శ్రీరామ్ కు మద్దతుగా నిలుస్తున్నారు. ఇదంతా నాలుగేళ్ల కిందట జరిగిన సంఘటన. కానీ ఇప్పుడు శ్రీరెడ్డి ఇలా బయటపెట్టడానికి ఓ కారణం ఉంది.
శ్రీరామ్ ఇండియన్ ఐడల్ విన్నర్ మాత్రమే కాకుండా బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో కంటెస్టెంట్. మొదట్లో శ్రీరామ్ కాస్త డల్ గా కనిపించినా.. ప్రస్తుతం ఆయన ఇమేజ్ పెరిగిపోతుంది. కూల్ గా కనిపిస్తూనే తనకు ఇచ్చిన టాస్క్ లను పూర్తి చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి అతనికి సంబంధించిన విషయాలను ఇలా సోషల్ మీడియాలో ఉంచిందని అనుకుంటున్నారు. అయితే శ్రీరామ్ అంటే పడని కొందరు శ్రీరెడ్డి పోస్టులను వైరల్ చేసేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు శ్రీరెడ్డి, శ్రీరామ్ గురించే ఎక్కువగా చర్చించుకుంటున్నారు.
Also Read: ఒకే హీరోకు భార్యగా, తల్లిగా నటించిన హీరోయిన్స్ వీళ్ళే !