World Smile Day: ప్రతి ఒక్కరి జీవితంలో చిరునవ్వు అనేది చాలా ముఖ్యం. ముఖంపై చిరునవ్వుతో ఎలాంటి సమస్యలను అయిన అధిగమించవచ్చు. అయితే ఈరోజుల్లో చాలామంది వ్యక్తిగత కారణాల వల్ల ఎక్కువగా నవ్వుకుండా బాధపడుతూ ముఖంపై చిరునవ్వును పొగొట్టుకుంటున్నారు. చిరునవ్వు గురించి ప్రజలకు తెలియజేయాలని అక్టోబర్ మొదటి శుక్రవారం నాడు వరల్డ్ స్మైల్ డేను ప్రతీ ఏడాది ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది వరల్డ్ స్మైల్ డే ఈరోజు అనగా అక్టోబర్ 4న జరుపుకుంటున్నారు. దయతో, ఒక వ్యక్తికి చిరునవ్వుతో సాయం చేయండనే ఉద్దేశంతో వరల్డ్ స్మైల్ డేను జరుపుకుంటారు. మరి ఈ స్మైల్ డే ఎలా వచ్చింది? దీని చరిత్ర ఏంటి? పూర్తి వివరాలు స్టోరీలో తెలుసుకుందాం.
దీని వెనుక చరిత్ర?
మసాచుసెట్స్‌కు చెందిన వ్యాపార చిత్రకారుడు హార్వే బాల్, వోర్సెస్టర్, 1963లో స్మైలీ ఫేస్ చిహ్నాన్ని అందరికీ తెలియజేశారు. వాణిజ్య కారణాల దృష్ట్యా ఈ చిహ్నం అర్థం కోల్పోయింది. కనీస వ్యక్తుల్లో చిరునవ్వు కూడా లేదు. ఇలా వచ్చిందే వరల్డ్ స్మైల్ డే. దీనిని మొదటిగా 1999లో ప్రారంభించారు. అలా కాలక్రమంగా ప్రతి ఏడాది చేసుకోవడం మొదలు పెట్టారు. హార్వే బాల్ వరల్డ్ స్మైల్ ఫౌండేషన్ చిరునవ్వుల కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యతను పెంచడానికి ప్రయత్నిస్తోంది. ప్రతీ ఏడాది దీని గురించి అవగాహన కల్పిస్తోంది. అలా హార్వే బాల్ వరల్డ్ స్మైల్ ఫౌండేషన్‌తో ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఏడాది అక్టోబర్ మొదటి శుక్రవారం రోజు ప్రపంచ చిరునవ్వు దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ ఏడాది దయతో చర్యలు చేయండి.. ఒక వ్యక్తికి చిరునవ్వుతో సాయం చేయండని జరుపకుంటున్నారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఒకరికి చిరునవ్వుతో చేయాలి. ఎదుటి వారిని నవ్వించడానికి ఏదైనా మనస్ఫూర్తిగా చేయాలని ఉద్దేశంతోనే ఈ వరల్డ్ స్మైల్ డేను జరుపుకుంటారు.
చిరునవ్వుతో ప్రయోజనాలు
జీవితంలో సంతోషం అనేది చాలా ముఖ్యం. నవ్వడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. చిరునవ్వుతో ఉంటే బాడీలో హ్యాపీ హార్మోన్లు విడుదల అయ్యి.. కార్డినాల్, అడ్రినలిన్ ఒత్తిడి హార్మోన్లు తగ్గుతాయి. చిరునవ్వుతో ఉంటే ఒత్తిడిని జయించవచ్చు. అలాగే ఎక్కువ కాలం జీవిస్తారు. మానసికంగా సంతోషంగా ఉండటంతో పాటు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. నవ్వడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే రక్తపోటు సమస్యలు, గుండె సమస్యలు ఇలా ఎన్నో సమస్యల నుంచి విముక్తి పొందుతారు. నవ్వడం వల్ల శరీరంలో హ్యాపీ హార్మోన్ డోపమైన రిలీజ్ అవుతుంది. దీనివల్ల ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. కొందరు నవ్వకుండా చిరాకుగా, కోపంగా ఉంటారు. అడిగితే చుట్టూ నవ్వే పరిస్థితులు లేవని అంటారు. అలా కాకుండా మీ చిరునవ్వును మీరే సృష్టించుకోవాలి. ఎంత డల్‌గా ఉన్నా ఏదో విధంగా నవ్వాలి. జోక్‌లు వేసుకుంటూ, కామెడీ సీన్లు చూస్తూ, వింటూ ఇలా ఏదో విధంగా రోజులో నవ్వుతుండాలి. అప్పుడు జీవితం సంతోషంగా ఉంటుంది.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: On the occasion of world smile day
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com