Numerology : జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలని ఎవరికైనా ఉంటుంది. కానీ ఆవగింజంతైన అదృష్టం లేకపోతే ఎంత చేసినా కష్టమేనని అనుకుంటూ ఉంటారు కొందరు. అయితే ఆవగింజంతైన అదృష్టం అందరికీ ఉండకపోవచ్చు. కానీ కొన్ని పరిహారాల వల్ల అంతకు మించిన అదృష్టాన్ని పొందవచ్చని అంటున్నారు. అంతేకాకుండా కొందరు పుట్టుకతోనే అదృష్టంతో ఉంటారని.. ఆ విషయాన్ని తెలుసుకోలేక ఏవేవో పనులు చేస్తారని అంటున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వారికి అదృష్టం లక్కల పట్టుకుంటుందని.. అయితే ఆ విషయం తెలుసుకొని తదనుగుణంగా కొన్ని పరిహారాలు చేయడం వల్ల అదృష్టం పట్టుకుంటుందని అంటున్నారు. సంఖ్యా శాస్త్రం ప్రకారం ఇంతకీ ఏ తేదీల్లో పుట్టిన వారు అదృష్టవంతులు? వారి లక్షణాలు ఎలా ఉంటాయి? ఆ వివరాలు కి వెళ్తే..
Also Read : ఈ పనులు చేస్తే జ్ఞాపకశక్తి తగ్గిపోవడం ఖాయం!
సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వారు అదృష్టవంతులుగా ఉంటారు. మీరు ఏ కొంచెం పనిచేసిన వెంటనే అదృష్టవంతులుగా మారిపోతారు. అందుకు వారు జన్మించిన రాశులు సమయమే కారణం అని సంఖ్యాశాస్త్రం తెలుపుతుంది. సంఖ్యా శాస్త్రం ప్రకారం మూల సంఖ్య 1 సంఖ్య కలిగిన వారు జీవితంలో అన్ని విజయాలు సాధిస్తారని తెలుపుతుంది. అలాగే వీరు వ్యాపారంలో రాణిస్తారని పేర్కొంటున్నారు.
ఒక ఏడాదిలో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ నెలలో అయినా 1,10,19,28 తేదీల్లో పుట్టిన వారు మూల సంఖ్య 1 గా పరిగణిస్తారు. ముఖ్యంగా ఆయా తేదీల్లో జన్మించిన వారు వ్యాపార రంగంలో బాగా రాణిస్తారు. మిగతా వారి కంటే వీరు ధైర్యవంతులుగా ఉంటారు. అంతేకాకుండా ఇంత కష్టం వచ్చినా వెనుకడుగు వేయరు. ఒకవేళ ఆపద సమయం వస్తే చాకచక్యంగా పరిస్థితి నుంచి తప్పించుకుంటారు. సమాజంలో గుర్తింపు లభించే వీరు.. శక్తివంతమైన నాయకుడిగా ఎదుగుతారు. అలాగే ఏ పని చేసినా దానికి తగిన ఫలితాన్ని పొందుతారు. వీరి పనుల వల్ల ఎదుటివారిని ఆకర్షిస్తారు. అంతేకాకుండా వీరితో సంబంధాలు పెట్టుకుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది.
పైన సూచించబడిన తేదీల్లో పుట్టిన వారు సంబంధాలు మెరుగుపరుస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఏ చిన్న వివాదం ఏర్పడిన వెంటనే పరిష్కరించుకుంటారు. మిగతా వారి కంటే వీరు ఇలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. వీరికి ఆహారం డబ్బు కన్నా సమాజంలో గుర్తింపు చాలా అవసరం. అందుకే ప్రజల కోసం వీరు ఏమైనా చేయడానికి వెనుకాడరు. అంతేకాకుండా సమాజంలో వీరికి అంటూ ప్రత్యేకంగా గుర్తింపు ఉండాలని తపన పడుతూ ఉంటారు.
ఆయా తేదీల్లో పుట్టిన వారికి సూర్యుడు అనుగ్రహం ఉంటుంది. అలాగే మిగతా గ్రహాల ప్రోత్సాహం కూడా ఉంటుంది. దీంతో వీరికి వాతావరణం అనుకూలంగా ఉండి.. ఏ పని చేపట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించిన వీరు లాభాలు పొందుతారు. ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉన్న వీరు వ్యాపారాలయంలో అద్భుతంగా రాణిస్తారు. అయితే వీరు ఇతరులతో వాగ్వాదాలు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో మాటలు అదుపులో ఉంచుకోవడం వల్ల సమస్యలను పరిష్కరించుకుంటారు.