Numerology: జీవితంలో ఎదగాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ దురదృష్టం, పేదరికం వల్ల తమ జీవితం బాగుపడదని కొందరు నిరాశ పడుతూ ఉంటారు. తమ జాతక చక్రం బాగుంటేనే జీవితం బాగుంటుందని భావిస్తారు. ఇదంతా నిజమో కాదో తెలియదు గానీ.. న్యూమరాజలీ ప్రకారం కొన్ని నెంబర్లు వ్యక్తుల జీవితాలను మార్చేస్తాయి. అందుకే కొందరు తమ దరిద్రాన్ని వదిలించుకోడానికి తమ పేరును మార్చుకుంటూ ఉంటారు. పేరు మాత్రమే కాకుండా పుట్టిన తేదీని బట్టి కూడా జాతకం నిర్ణయించబడుతుందని కొందరు న్యూమరాలజిస్టులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని పుట్టినతేదీలు అదృష్టాన్ని మోసుకొస్తాయని, వారు ఏ పనిచేసినా సక్సెస్ ఫుల్ గా ఉంటుందని చెబుతున్నారు. ఇంతకీ ఆ నెంబర్లు ఏవంటే?
న్యూమరాలజిస్టుల ప్రకారం పుట్టిన తేదీల్లో సింగిల్ డిజిట్ క్రోడీకరించగా వచ్చే మాస్టర్ నంబర్స తో తమ జీవితం ఎలా ఉంటుందో చెప్పవచ్చని అంటున్నారు. కొన్ని నెంబర్లు కలిగిన వారు అదృష్టవంతులే కాకుండా తెలివైన వారు కూడా అవుతారు. అలాంటి నెంబర్లలో ‘8’ ఒకటి. ఒక వ్యక్తి పుట్టిన తేదీలన్నిటిని కలిపితే 8 వస్తే అతనికి ఆర్థికంగా బాగుంటుంది. ఏ పనిచేసినా లాభాలు పొందుతాడు. నైపుణ్యాుల కలిగి ఉంటాడు.
పుట్టిన తేదీల్లోని సింగిల్ డిజిట్ లన్నింటిని కలపగా 17 నెంబర్ వచ్చే వారికి తెలివి ఎక్కువగా ఉంటుంది. వీరు అత్యంత శక్తివంతంగా ఉంటారు. ఆర్థిక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. 4 నెంబర్ వచ్చే వ్యక్తులు అదృష్టవంతులై ఉంటారు. వీరికి డబ్బు ఆదా చేయడం, ప్లానింగ్ చేయడం, మేనేజ్ చేయడం ఈజీగా ఉంటుంది.మొత్తంగా ఫైనాన్స్ పట్ల పూర్తి అవగాహన ఉంటుంది. 13 నెంబర్ కలిగిన వ్యక్తులు ఎదుటివారి గురించి ఈజీగా అంచనా వేస్తారు. దీంతో తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు.