12 Deficiency: ప్రతి ఒక్కరి శరీరంలో విటమిన్, మినరల్స్, కాల్షియం, ఐరన్ వంటివి ఎంత మోతాదులో ఉండాలో ఆ మోతాదులో ఉండాల్సిందే. లేదంటే శరీరాన్ని అనారోగ్య సమస్యల నుంచి కాపాడటం కోసం ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తుంటుంది. విటమిన్ ల లోపం వల్ల ఎన్నో సమస్యలు వస్తుంటాయి. మరి విటమిన్ బీ12 లోపం మీలో ఉన్నట్టు అయితే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా? ఒకసారి ఈ సమస్యలు మీలో వస్తే వాటిని నయం చేయడం కోసం చాలా కష్టపడాల్సిందే. మరి విటిమిన్ బీ
12 వల్ల వచ్చే సమస్యలు ఏంటో ఓ సారి చూసేయండి.
విటమిన్ బీ 12అనేది చాలా సాధారణ సమస్య. చాలా మందిలో ఈ లోపం ఉంటుంది. ఈ లోపం ఉన్నవారికి బలహీనత ఒక సాధారణ లక్షణంగా ఉంటుంది. ఏ పని చేయకపోయినా కూడా బలహీనంగా శక్తి లేని వారిగా చాలా వీక్ గా కనిపిస్తుంటారు. అందుకే కాస్త బీ12 విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ లోపం ఉంటే గుండె దడ, ఒత్తిడి వంటి లక్షణాలు కనిపిస్తాయి. తలనొప్పి, కళ్లు తిరగడం, పాలిపోయిన చర్మం వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. జీర్ణ సమస్యలు కూడా ఈ లోపం వస్తాయి అంటున్నారు నిపుణులు.
బీ12 లేకపోవడం వల్ల ఏకాగ్రతను కూడా కోల్పోతరట. అయితే విటమిన్ సప్లిమెంట్ల వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు. దీని కోసం పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. కేవలం బీ 12 ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల మీ సమస్యను దూరం చేసుకోవచ్చు. ఎక్కువ మొత్తంలో ఈ లోపం ఉంటే సప్లిమెంట్స్ ద్వారా, అధికంగా బీ 12 ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఈ బీ 12 లభిస్తుంటుంది.
ఏవైనా విటమిన్ సమస్యలు వచ్చేకంటే ముందే ఆయా విటమన్లు, మినరల్స్ వంటివి ఉండే ఆహారాలను సమృద్ధిగా తీసుకుంటే భవిష్యత్తులో కూడా ఈ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఏ విటిమిన్ లు ఎందులో లభిస్తాయో ఒసారి తెలుసుకొని మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటే మీరు ధనవంతులే. ధనం ఉంటేనే కాదండోయ్ ఆరోగ్య సమస్యలు లేని వారు కూడా పూర్తి ధనవంతులే అంటారు పెద్దలు. మరి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందికాబట్టి ధనవంతులుగా మారండి.