NPS: ప్రభుత్వం ఉద్యోగం ఇంట్లో ఒకరికి వస్తే వారి మూడు తరాలు బతుకుతాయన్న పేరు ఉంది. శ్రమ తక్కువ.. పైకం ఎక్కువ. అందుకే అందరూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెంపర్లాడుతారు. దానికోసం కష్టపడుతుంటారు. రిైటర్ మెంట్ అయ్యాక కూడా ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ రూపంలో బాగానే వస్తుంటుంది. జీవితాంతం సుఖంగా బతకవచ్చన్నమాట..

ఇక ప్రైవేటు ఉద్యోగులదీ బండ చాకిరీ.. పైకి 8 గంటలు అంటారు కానీ.. 12 గంటల వరకూ ముక్కుపిండీ మరీ పనులు చేయిస్తారు. నెలజీతం తక్కువగానే ఉంటుంది. వీరికి పెన్షన్ లు, పీఎఫ్ లు, రిటైర్ మెంట్ బోనస్ లు, పెన్షన్ లు ఏమీ ఉండవు.
Also Read: NTR Fights Tiger: ఆర్ఆర్ఆర్: పులితో ఎన్టీఆర్ పోరాటం.. ఎలా తీశారో మేకింగ్ వీడియో వైరల్
అయితే తాజాగా ప్రైవేటు ఉద్యోగాల్లో ఉన్న వాళ్లకి.. చిరు వ్యాపారస్థులకు కూడా నెలనెలా పెన్షన్ పొందే వీలు కల్పిస్తోంది నేషనల్ పెన్షన్ సిస్టమ్( ఎన్పీఎస్). దీని ద్వారా రిటైర్ మెంట్ వయసు తర్వాత ప్రతి నెల రూ.50వేలు వచ్చేలా ప్లాన్ చేసుకోవచ్చు.
ఎన్.పీఎస్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పెన్షన్ స్కీం. ఇందులో పెట్టిన పెట్టుబడికి ఎలాంటి ఢోకా ఉండదు. రిటైర్ మెంట్ కు ముందు నుంచే దాచుకునే సౌలభ్యాన్ని కల్పించడానికి ఏర్పాటైందే ఈ ఎన్.పీఎస్. ఇందులో క్రమక్రమంగా పెట్టుబడులు పెట్టి రిటైర్ మెంట్ వయసు తర్వాత నెలనెలా కొంత మొత్తాలను ఇక్కడ తీసుకోవచ్చు.

ఒక యువకుడు 35 ఏళ్ల పాటు నెలకు రూ.5వేలు చొప్పున ఎన్.పీ.ఎస్ లో జమ చేస్తే అతడికి 65 ఏళ్లు వచ్చే నాటికి రూ.27.30 లక్షలు జమ అవుతాయి. కానీ అది వడ్డీతో కలిపి మొత్తం రూ.2.48 కోట్లు అవుతుంది. ఈ మొత్తం తీసుకోవడానికి అవకాశం ఉండదు. అందులోంచి నెలనెలా రూ.58వేల పెన్షన్ ను అందిస్తారు. ఇందులో 99.53 లక్షల మొత్తం లంప్సమ్ గా కూడా అందిస్తారు. తక్కువ వయసులో పెట్టుబడిని ప్రారంభిస్తే ఎక్కువ లాభం. దీనికి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు కూడా ఉంటుంది.
Also Read:Cyber Fraud: ఒక్క క్లిక్‌తో రూ.21 లక్షలు ఖాళీ.. సైబర్ మోసాలకు వాట్సాప్ వేదిక!