Richest man in the World: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎవరంటే ఎవరైనా ఏం చెప్తారు? ఎలన్ మస్క్.. బిల్ క్లింటన్.. అనిల్ అంబానీ.. వంటి పేర్లను చెబుతూ ఉంటారు. కానీ వీరి కంటే ఎక్కువ డబ్బును కలిగి ఉండి.. వీరి కంటే ఎక్కువ దేశాల్లో వ్యాపారాలు నిర్వహించే మరో వ్యక్తి ఉన్నారు. ఆయన పేరు చాలా మందికి మాత్రమే తెలుసు. ఆయన సంపద ఎంతంటే.. ఎలన్ మస్క్ కు చెందిన Tesla కంపెనీ లాంటివి 10 కొనుగోలు చేయొచ్చు. మరి ఆయన ఎవరు? ఎక్కడ తన వృత్తిని ప్రారంభించారు? ఇంత ఎత్తుకు ఎలా ఎదిగారు? ఆ వివరాల్లోకి వెళితే..
Larry Fink..ఈ పేరు చాలా తక్కువ మందికే తెలుసు. కానీ ఈయన గురించి తెలిస్తే నోరెళ్లబెడుతారు. ప్రపంచంలో అత్యధిక ధనం కలిగిన అమెరికాకే సాయం చేసిన వ్యక్తి అంటే నమ్ముతారా? కరోనా సమయంలో అమెరికా క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు లారీ ఫింక్ సాయం తీసుకుంది. అలాగే సెంట్రల్ బ్యాంకుకు ఈయన అప్పు ఇచ్చాడు. ఈయన పేూర్తి పేరు లారెన్స్ డగ్లస్ ఫింక్. 1952 నవంబర్ 2న కాలిఫోర్నియాలో జన్మించారు. ఎంబీఏ పూర్తి చేసిన ఈయన మొట్టమొదటిసారిగా 1976లో First Boston అనే ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులో ఉద్యోగిగా చేరాడు. ఆ తరువాత 1988లో Black Rock అనే కంపెనీని ప్రారంభించాడు.
ఈ బ్లాక్ రాక్ ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొందింది. ఎలాగంటే ప్రస్తుతం వంద దేశాలకు పైగా ఆయన వివిధ వ్యాపార కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. 2025 ఏడాదిలో ఈ కంపెనీ ఆస్తులు 10 ట్రిలియన్ డాలర్లకు చేరినట్లు తెలుస్తోంది. బ్లాక్ రాక్ కు గ్లోబల్ మార్కెట్స్, ఫెన్షన్ ఫండ్స్, ప్రభుత్వ ఫండ్స్, ఈక్వీటీస్, ఇన్వెస్ట్ మెంట్స్ అన్నింటిలోనూ పెట్టుబడులు పెట్టారు. ఈయన సొంతంగా ఒక బిలియన్ ఆస్తులను కలిగి ఉన్నట్లు ఒక అంచనా.గ్లోబల్ ఎకనామిని ప్రభావితం చేయగల వ్యక్తుల్లో లారీ ఫింక్ ప్రధానంగా ఉంటారని చెబుతూ ఉంటారు.
ఆర్థికంగా ఇతర దేశాలను ఆదుకునే అమెరికా ప్రభుత్వానికి లారీ ఫింక్ డబ్బు సాయం చేశాడు. 2008లో ఆర్థిక సంక్షోభం సమయంలో అమెరికాకు సాయం చేయడానికి ప్రభుత్వం బ్లాక్ రాక్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. 2009లో బ్లాక్ రాక్ గ్లోబల్ ఇన్వెస్టర్లను కొనుగోలు చేసింది. 2010లో పింక్ కు 23.6 డాలర్ల మిలియన్లు, 2021లో 36 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని పొందగలిగింది. ప్రస్తుతం 27 దేశాల్లో 12 వేల మంది ఉద్యోగులతో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. లారా ఫింక్ చేసిన సేవలకు 2016లో ABANA అచీవ్ మెంట్ అవార్డును పొందగలిగాడు. బ్యాంకింగ్, ఫైనాన్స్ లో అత్యుత్తమ నాయకత్వాన్ని ప్రదర్శించినందుకు ఈ అవార్డును అందించారు.