spot_img
Homeలైఫ్ స్టైల్No spend challenge: 'నో స్పెండ్ చాలెంజ్' ' అసలు ఏంటి ఇది? దీనిని ఎలా...

No spend challenge: ‘నో స్పెండ్ చాలెంజ్’ ‘ అసలు ఏంటి ఇది? దీనిని ఎలా స్వీకరించాలి? ఈ ఛాలెంజ్ తో లాభమేంటి?

No spend challenge: ప్రస్తుత కాలంలో డబ్బు చాలా అవసరంగా ఏర్పడింది. ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉంటున్నాయి. చిన్న చిన్న ఖర్చులే నిలాఖరులో పెద్ద ఖర్చుల మారి ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా భారం పడుతున్నాయి. ఉదయం లేచిన దగ్గర్నుంచి టీ మొదలు రాత్రి ఫుడ్ డెలివరీ వరకు ఎన్నో రకాల చిరుతిళ్లు కొనుగోలు చేయడం ద్వారా మనకు తెలియకుండానే వేల రూపాయలు వృథాగా పోతున్నాయి. అయితే ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొనేవారు ఈ చిన్న చిన్న ఖర్చులను తగ్గించుకునేందుకు ‘నో స్పెండ్ చాలెంజ్’ లోకి రావాలని కొందరు ఆర్థిక నిపుణులు అంటున్నారు. దీనివల్ల ఎన్నోవేల రూపాయలు ఆదా చేసుకోవచ్చని అంటున్నా. అసలు నోస్పెండ్ ఛాలెంజ్ అంటే ఏమిటి? దీనిని ఎలా పాటిస్తారు?

ఒక నిర్దిష్ట కాలంలో అత్యవసర ఖర్చులు తప్ప అనవసరపు ఖర్చులను దూరం చేస్తే వేల రూపాయలు మిగులుతాయి. ఒక నెలలో లేదా వారం లేదా మూడు రోజులపాటు కేవలం తప్పనిసరి ఖర్చులను మాత్రమే చేయాలి. రవాణా చార్జీలు, విద్యుత్ బిల్లులో, కూరగాయలు, మందుల అవసరాలు మాత్రమే తీర్చుకోవాలి. చిరుతిళ్ళు, సినిమా, ఆన్లైన్ షాపింగ్, బయట భోజనం, ఆకస్మిక కొనుగోలను ఈ రోజుల్లో నిలిపివేయాలి. ఇలా ఈ ఛాలెంజ్ ను స్వీకరిస్తే ఎంత ఆదాయం మిగులుతుందో లెక్కేసుకోవాలి. దీనివల్ల నెక్స్ట్ వీక్ లో అవసరం ఉన్న ఖర్చులు మాత్రమే పెట్టగలుగుతారు. అవసరం లేని ఖర్చులు తెలుసుకొని వాటికి దూరంగా ఉండగలుగుతారు. ఫలితంగా డబ్బు బాగా ఆదా అవుతుంది అని ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు.

చాలామంది తమ డబ్బు ఎక్కడ.. ఎంత ఖర్చవుతుందో తెలియని పరిస్థితి ఉంది. రూ 50 నుంచి మొదలు రూ 100 వరకు పెట్టే చిన్న చిన్న ఖర్చులే ఒక నెల వరకు భారంగా మారుతున్నాయి. అయితే ఈ ఛాలెంజ్ ను స్వీకరించడానికి ఒక నిర్దిష్ట ప్రణాళిక ద్వారా పాటించాలి. బయట భోజనం, ఆన్లైన్ షాపింగ్ వంటివి వెంటనే మానుకోలేరు. ఇందుకోసం ముందుగా ఒక రోజును ఛాలెంజ్ను స్వీకరించాలి. ఒకరోజు సక్సెస్ అయిన తర్వాత మూడు రోజులపాటు, ఆ తర్వాత వారం పాటు ఏర్పాటు చేసుకోవాలి. అయితే ఏ ఏ రోజుల్లో ఖర్చు చేయకూడదని అనుకుంటున్నారో ఆ రోజులను ముందుగానే ఉంచుకోవాలి. ఆ రోజుల్లో ఇంట్లో అవసరమైన ఆహారాన్ని సిద్ధం చేసుకోవాలి. అవసరంలేని మొబైల్ యాప్ ఆఫర్లను కూడా చూడకుండా ఉండాలి.

ఈ ఛాలెంజ్ను స్వీకరించడం వల్ల ఖర్చులపై స్పష్టమైన అవగాహన వస్తుంది. పొదుపు అలవాటు పెరుగుతుంది. ఆకస్మికంగా చేసే కొనుగోలు తగ్గుతాయి. ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతుంది. ఫలితంగా అప్పుల అవసరం లేకుండా ఉంటుంది. దీనివల్ల ఆర్థిక స్థిరత్వం ఉండడమే కాకుండా మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు. డబ్బుపై విలువ పెరుగుతుంది. వ్యక్తిగతంగా, కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఛాలెంజ్ ను స్వీకరిస్తే స్పష్టమైన మార్పు కనిపించే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version