Homeలైఫ్ స్టైల్Meaning of Kuruvruddhulu: కురువృద్ధులు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఏ యే రంగంలో...

Meaning of Kuruvruddhulu: కురువృద్ధులు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఏ యే రంగంలో కురువృద్ధులు ఉన్నారు?

Meaning of Kuruvruddhulu: రాజకీయాల్లో వార్తలు విన్నప్పుడు ఎక్కువగా కురువృద్ధుడు అనే పదం వింటూ ఉంటాం. అలాగే కొన్ని సందర్భాల్లో సామాజిక, సాహిత్యం, విద్యా రంగాల్లో కృషి చేసిన వారిని సైతం ఇలా పిలుస్తూ ఉంటారు. ఒక రంగంలో దశాబ్దాల పాటు సేవలు అందించిన పెద్దలను గౌరవించి మాట్లాడేటప్పుడు ఈ పదం వినిపిస్తుంది. ఉదాహరణకు రాజకీయ కురువృద్ధుడు అనగానే ఎల్కే అద్వానీ పేరు వచ్చేది. అయితే ఈ కురువృద్ధుడు అనే పదం మహాభారతంలోని మొదలైంది. అప్పటి నుంచే దీనిని వాడుతున్నారు. ఇంతకీ కురువృద్ధుడు అంటే అర్థమేంటి?

కురు అనేది మహాభారత కాలంలోని రాజవంశానికి పేరు. హస్తినాపురం ను పాలించిన ఈ వంశంలో పాండవులు, కౌరవులు ఇద్దరూ ఉంటారు. అందువల్ల ఆ వంశానికి చెందిన పెద్దలను కురువృద్ధులు అని పిలిచేవారు. భీష్ముడు, ధృతరాష్ట్రుడిని కురువృద్ధులుగా సంబోధిస్తారు. అయితే ఇక్కడ వృద్ధులు అనే పదం వయసు పెరిగిన వారికే కాకుండా అనుభవం, జ్ఞానం, రాజకీయ అవగాహన, నిర్ణయ సామర్థ్యం కలిగిన వారిని కూడా సూచిస్తుంది. అందుకే ఈ పదం ను కొందరికి మాత్రమే వాడుతారు. రాజకీయాల్లో సీనియర్ నాయకులు అనుభవంతో పాటు చరిత్రకు సాక్షులుగా ఉంటారు. అనేక ప్రభుత్వాలు, ఎన్నికలు, సిద్ధాంత మార్పులు చూసిన నాయకులుగా పేర్కొనబడతారు. అందుకే వారిని రాజకీయ కురువృద్ధులుగా పేర్కొంటారు.

అయితే రాజకీయాల్లో ఉండేవారు మాత్రమే కాకుండా సాహిత్యం, న్యాయవ్యవస్థ, సినిమా, విద్యా రంగాల్లోనూ కీలకంగా ఉన్నవారికి కురువృద్ధులు అనే పదం వాడుతున్నారు. సాహిత్య రంగంలో అనేక దశాబ్దాలుగా రచనలు చేసి తరతరాల వారికి ప్రభావం చూసిన వారిని కురువృద్ధులుగా పేర్కొంటారు. అలాంటి వారిలో సి నారాయణ రెడ్డి, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, విశ్వనాథ సత్యనారాయణ వంటి వారు సాహిత్య రంగంలో ఎనలేని సేవలు చేశారు. అలాగే న్యాయవ్యవస్థలో చట్టపరమైన అవగాహన, రాజ్యాంగంపై పట్టు, ప్రజాస్వామ్య వ్యవస్థకు చేసిన సేవలతో కొందరు న్యాయమూర్తులు ఈ గౌరవాన్ని పొందుతారు. అలాంటి వారిలో ఎంఎన్ వెంకటాచలయ్య, ఎస్ నరిమాను, పి సదాశివం వంటి వారు ఉన్నారు. సినిమా రంగాల్లో అమితాబచ్చన్, కే విశ్వనాథ్, అక్కినేని నాగేశ్వరరావు వంటి వారు కురువృద్ధులుగా పేర్కొనపడతారు. విద్యారంగంలో యశ్పాల్ వంటి వారు ప్రముఖులుగా ఉన్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...
Oktelugu Epaper
Exit mobile version