New Couples: ప్రతి మనిషి జీవితంలో వివాహం అనేది ముఖ్యమైన ఘట్టమని చెప్పుకోవచ్చు. అలాగే పెళ్లి తరువాత దాంపత్య జీవితం సుఖంగా, ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారన్న సంగతి తెలిసిందే. అయితే కొంతమంది జీవితంలో కొన్ని కొన్ని సమస్యలు తలెత్తుతాయి. కానీ విభేదాలు, కలతలు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
సాధారణంగా ఆలు మగల మధ్య అవగాహన, సర్దుకుపోయేతత్వం తప్పనిసరిగా ఉండాలి. చిన్న చిన్న అసంతృప్తులను సర్దుబాటు చేసుకుంటే.. వారి జీవితం ఆనందదాయకంగా, కలర్ ఫుల్ గా ఉంటుంది. అదేవిధంగా వారి మధ్య ప్రేమ చిగురించి బంధం బలపడుతుంది. అభిప్రాయాలను తెలుసుకోవడం, అభిరుచులకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాల ద్వారా పెళ్లికి ముందు నుంచే వారి మధ్య మానసిక బంధం బలపడుతుంది.. ఇందుకోసం ఏ విధంగా నడుచుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఇద్దరి మధ్య ముగిసిన బంధాల గురించి ప్రస్తావించకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే కొత్త ఇంటికి మారాలనుకుంటే మీ స్పేస్ ప్లాన్ చేసుకోవాలని చెబుతున్నారు. భాగస్వామిని అర్ధం చేసుకోవడంతో పాటు వారికి అర్థం అయ్యేందుకు టైం పడుతుందని గ్రహించాలి. అలాగే ఆహారపు, ఇతర అలవాట్లు, ఆరోగ్యం, ఇష్టాయిష్టాల గురించి చర్చించండని సూచిస్తున్నారు.
భాగస్వామిలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే సున్నితంగా తెలపాలని నిపుణులు సూచిస్తున్నారు. దాంతోపాటుగా ఆర్థిక స్థితిగతులు, లక్ష్యాలు, బాధ్యతలు మరియు సంతానం గురించి ముందే చర్చించుకోవడం మంచిదని తెలుస్తోంది. ఇరువురి మధ్య ఉన్న బంధం నిలబడుతుందని చెబుతున్నారు.