New options in Gemini AI: ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మొబైల్ వినియోగం ఎక్కువగా మారింది. ఇందులోనూ కొత్త కొత్త యాప్స్ రావడంతో వినియోగదారులు సందడి చేస్తున్నారు. ఇటీవల Gemini AI యాప్ తో ప్రతి ఒక్కరూ తమ ఫోటోలను 3d ఎఫెక్ట్ గా మార్చుకుంటున్నారు. అయితే ఈ యాప్ వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయని చాలామంది చెబుతూ వచ్చారు.. ఇందులో ఫోటో అప్లోడ్ చేస్తే పర్సనల్ డేటా లీక్ అవుతుందని కొందరు సాంకేతిక నిపుణులు హెచ్చరించారు. అయితే జెమిని ఏఐ యాప్ ను పర్సనల్ ఫోటో యూస్ చేయకుండా వివిధ రకాలుగా దీనిని వాడుకోవచ్చు. ఇందులో కొన్ని ఫోటోలను మార్చుకొని మనకు కావాల్సిన విధంగా తయారు చేసుకోవచ్చు. వివరాల్లోకి వెళ్తే..
గూగుల్ కు సంబంధించిన Gemini AI యాప్ ద్వారా ఫోటో ఎడిటింగ్ తో పాటు వీడియో తయారు చేసుకునే అవకాశం ఉంది. అయితే చాలామంది ఫోటోలు త్రీడీ ఎఫెక్ట్లా మార్చుకుంటూ సందడి చేస్తున్నారు. త్వరలో రాబోతున్న కొన్ని పండుగల సీజన్ నేపథ్యంలో ఈ యాప్ కొన్ని రకాల ప్రాంప్ట్ లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి ద్వారా మనకు ఎలా కావాలంటే అలా ఫోటోను మార్చుకోవచ్చు. వీటిలో దుర్గా పూజ కు సంబంధించిన ప్రాంప్ట్, హాగ్ ఎడిటింగ్, ఎమోషనల్ వీడియో, బాలీవుడ్ స్టైల్ డ్రెస్సింగ్, వివాహానికి ముందు కలిసి ఉన్న వీడియోలు.. సెలబ్రిటీతో కలిసి నట్లు.. ఇలా పలు రకాల ఫోటో లేదా వీడియోలు ఎడిటింగ్ చేసుకునే అవకాశాన్ని అందుబాటులో ఉంచింది..
త్వరలో దుర్గా పూజ మహోత్సవం ప్రారంభం అవుతున్నందున ఈ యాప్ దుర్గా పూజకు సంబంధించిన ఫోటోను మనకు ఎలా కావాలంటే అలా మార్చుకునే విధంగా ఈ యాప్ కొన్ని ప్రాంప్ట్ లను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఇవన్నీ తయారు చేసుకోవాలంటే ఇందులోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ జిమెయిల్ తో లాగిన్ అయిన తర్వాత కావాల్సిన ఫోటోలు పొందవచ్చు. కానీ కొన్ని హెచ్చరికల నేపథ్యంలో పర్సనల్ ఫోటోలను కాకుండా.. ఇతర స్టేటస్ కోసం ఫోటోలను తయారు చేసుకుంటే మంచిది అని కొందరు సూచిస్తున్నారు.
అంతేకాకుండా కొన్ని అవసరాలకు 16 బిట్ వీడియోను కూడా తయారు చేసుకునే అవకాశం ఉంది. బాలీవుడ్ స్టైల్ వెడ్డింగ్ లో ఉన్నట్లు.. పక్కనే సెలబ్రిటీ కూర్చున్నట్టు.. ప్రముఖులతో షేరింగ్ చేసుకున్నట్టు.. వీడియోలను తయారు చేయవచ్చు. ఇటీవల నానో బనానా కు సంబంధించిన యాప్ ను చాలామంది ఉపయోగించుకున్నారు. పర్సనల్ ఫోటోలను అప్లోడ్ చేసి వారికి ఎలా కావాలంటే అలా మార్చుకున్నారు. ఇప్పుడు మరిన్ని ఆప్షన్లను జెమిని ఏఐ అందుబాటులోకి తీసుకొచ్చింది.