New GST 2025: జీఎస్టీ 2.0. సెప్టెంబర్ 22 నుంచి అమలు అవుతోంది. ఇప్పటివరకు ఉన్న స్లాబ్ లను సరి చేయడంతో పాటు మరికొన్నింటి వాటిపై పూర్తిగా రద్దు చేశారు. వీటిలో 18% నుంచి 12.. 12% నుంచి 5% తగ్గించారు. దీంతో కార్లు, టీవీలు, ఏసీలు, మొబైల్స్ తో పాటు నిత్యవసర వస్తువుల ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లోని షాప్ నిర్వాహకులు జీఎస్టీ తగ్గినా కూడా.. పాత వస్తువులు అని చెబుతూ వాటిపై జిఎస్టి పాత పద్ధతిలోనే ఉంటుందని ఎక్కువ ధరకు వస్తువులను విక్రయిస్తూ ఉంటారు. కొందరు ఈ విషయంపై దబాయింపు కూడా చేస్తారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంది.
సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ తగ్గడంతో చాలామంది వినియోగదారులు వస్తువులను కొనుగోలు చేశారు. ధరలు తగ్గుతాయన్న ఆశతో సెప్టెంబర్ 22 వరకు వేచి చూసి.. ఆ తర్వాత సూపర్ మార్కెట్ లేదా షాపింగ్ మాల్ కు వెళ్లిన వారికి నిరాశే ఎదురైంది. ఎందుకంటే కొందరు నిర్వాహకులు పాత వస్తువుల మ్యానుఫ్యాక్చర్ చూపించి వాటిపై పాత జిఎస్టి వర్తిస్తుందని చెప్పి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. అంతేకాకుండా తమకు ధర ఎక్కువ కు అమ్మే హక్కు ఉందని చెబుతుంటారు. కానీ ఇలా ఎక్కువ ధరకు అమ్మినట్లయితే వారిపై చర్యలు తీసుకోవచ్చు.
సెప్టెంబర్ 22 తర్వాత పాత వస్తువులు ఏవి ఉన్నా కూడా.. కొత్త జీఎస్టీ అమలుచేసి వస్తువుల ధరలు తగ్గించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక వస్తువుపై జీఎస్టీ తగ్గితే వస్తువుల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కానీ అలా కాకుండా వారు తగ్గించమని చెబితే 18001140001915 అనే నెంబర్ కి కాల్ చేయవచ్చు. ఈ నెంబర్ ద్వారా ఏ షాపు అయితే పాత జిఎస్టి తోనే విక్రయిస్తున్నారో.. వారిపై ఫిర్యాదు చేయవచ్చు. దాంతో వినియోగదారులు నష్టపోకుండా ఉండే అవకాశం ఉంటుంది.
ఇక ఆరోగ్య బీమా, జీవిత బీమాపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేశారు. అయినా కొందరు పాలసీ విక్రయించేవారు ఏదో ఒకటి చెప్పి మళ్లీ పాత ధరలోనే పాలసీలను అమ్ముతున్నారు. ఇలాంటి వారి గురించి కూడా పై నెంబర్లో ఫిర్యాదు చేయవచ్చు. జీఎస్టీని పూర్తిగా రద్దు చేస్తే పాలసీ ధర భారీగా తగ్గే అవకాశం ఉంటుంది. అయితే గతంలో చెల్లించిన ప్రీమియం.. ఇప్పుడు చెల్లించే ప్రీమియంలో తేడా ఏం ఎలా ఉందో చూసుకోవాల్సిన అవసరం వినియోగదారుల పైనే ఉంటుంది. ఇలా జీఎస్టీ విషయంలో ఎవరైనా మోసం చేయాలని చూస్తే వారిపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దసరా కానుకగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించి ప్రజలకు తక్కువ ధరలకే వస్తువులు విక్రయించాలని నిర్ణయించింది. ఇలాంటి సమయంలో కూడా వస్తువుల ధరలు తగ్గకపోతే నష్టపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎవరైనా ఈ సమస్యను ఎదుర్కొంటే పై నెంబర్కు కాల్ చేయండి.