US military in Bangladesh: బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత, మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ మార్పుతోపాటు, చిట్టగాంగ్ సమీపంలో అమెరికా–బంగ్లాదేశ్ సంయుక్త సైనిక వ్యూహాలు మొదలయ్యాయి. సెయింట్ మార్టిన్ ఐల్యాండ్ చుట్టూ తలెత్తిన ఊహాగానాలు, మయన్మార్‌లోని రేర్ ఎర్త్ మినరల్స్‌పై అమెరికా ఆసక్తి – ఇవి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. భారత్ కోసమే అమెరికా సైనిక కార్యకలాపాలు పెంచుతోందని పత్రికలు, ఛానెళ్లలో వస్తున్న కథనాలు ఈ అంశాలను ఊహాగానాలతో కలిపి చర్చిస్తున్నాయి.
అమెరికా సైన్యం దిగిందా?
బంగ్లాదేశ్‌లో అమెరికా సైన్యం ‘దిగిందా?‘ అనే ప్రశ్నకు సమాధానం.. పూర్తి స్థాయి మిలిటరీ బేస్ లేదు, కానీ సంయుక్త వ్యూహాలు జరుగుతున్నాయి. 2025 జూన్‌లో ‘ఎక్సర్‌సైజ్ టైగర్ లైట్‌నింగ్‘ ³రుతో చిట్టగాంగ్ సమీపంలో అమెరికా–బంగ్లాదేశ్ సైన్యాలు పాల్గొన్నాయి. ఈ వ్యూహాలు శాంతి స్థాపన, డిజాస్టర్ రెస్పాన్స్, కౌంటర్–టెర్రరిజం పై దృష్టి సారించాయి. సెప్టెంబర్‌లో ‘ఆపరేషన్ పసిఫిక్ ఏంజెల్ 25–3‘ మరో సంయుక్త వ్యూహం, ఇందులో శ్రీలంక కూడా పాల్గొంది. సెయింట్ మార్టిన్ ఐల్యాండ్ సమీపంలో ఈ కార్యకలాపాలు జరగడంతో, షేక్ హసీనా మునుపటి ఆరోపణలు(అమెరికా దీన్ని ఆక్రమించాలని ఒత్తిడి చేసిందని) మళ్లీ చర్చలోకి వచ్చాయి. అయితే, అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ మాట్లాడుతూ, ‘ఐల్యాండ్‌ను తీసుకోవడానికి ఎలాంటి చర్చలు జరగలేదు‘ అని తిరస్కరించింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా ‘రొటీన్ ప్రోగ్రామ్‘ అని చెప్పింది. ఇక ఈకనామిక్ టైమ్స్, ఫస్ట్‌పోస్ట్ వంటి మీడియా ఈ వ్యూహాలను ‘అమెరికా ఫుట్‌ప్రింట్ పెరుగుదల‘గా వర్ణించాయి. కానీ మయన్మార్ కోసమే అమెరికా కార్యకలాపాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మయన్మార్ చరిత్ర.. చైనా ఆధిపత్యం
మయన్మార్ 1948లో బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్య్రం పొందింది. 1962లో సైనిక అధికారం, 2011 వరకు కొనసాగింది. 2021లో మళ్లీ కూడ్, ప్రజాస్వామ్య పునరుద్ధరణకు అమెరికా మద్దతు (ఆంగ్ సాన్ సూకీకి నోబెల్ బహుమతి 1991లో). కానీ సైనికులు చైనాకు దగ్గరయ్యారు. దీంతో అమెరికా ఆంక్షలు విధించింది. కచ్చిన్ స్టేట్ (క్రిస్టియన్ ఆధిపత్యం)లో రెబెల్ గ్రూపులు (కాచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీ) చైనా–అమెరికా మధ్య టెన్షన్ పెంచాయి. మయన్మార్‌లో రేర్ ఎర్త్ మినరల్స్ (గ్లోబల్‌గా 3వ స్థానం) చాలా. చైనా (1వ స్థానం) ఇవి కొనుగోలు చేసి, ప్రాసెసింగ్‌లో 90% ఆధిపత్యం చెలాయిస్తోంది. కచ్చిన్‌లో చైనా మైనింగ్‌లు, రెబెల్స్‌తో డీల్స్ – ఇది కోల్డ్ వార్ తర్వాతి జియోపాలిటిక్స్‌ను ప్రతిబింబిస్తుంది. అమెరికా దృష్టి ఇప్పుడు ఈ మినరల్స్‌పై పడింది. చైనా ఎక్స్‌పోర్ట్ రెస్ట్రిక్షన్స్‌తో అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలని ప్లాన్.
రేర్ ఎర్త్ మినరల్స్ కోసం మయన్మార్‌తో డీల్స్?
2025లో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత, మయన్మార్ పాలసీ మారింది. రెబెల్ గ్రూపులు (కచ్చిన్) నియంత్రించిన మైన్స్‌కు అమెరికా యాక్సెస్ కోసం ప్రతిప్రతిపక్షాలు వినిపించారు. జంటా అలయెస్‌పై ఆంక్షలు ఎత్తివేశారు, ఇండియాతో ప్రాసెసింగ్ పార్ట్‌నర్‌షిప్ ప్రతిపాదనలు. రెబెల్స్‌తో డైరెక్ట్ డీల్స్? లాజిస్టిక్స్ సవాళ్లు (పర్వతాలు, యుద్ధం) ఉన్నా, ట్రంప్ టీమ్ ‘చైనా నుంచి డైవర్ట్‘ చేయాలని చూస్తోంది. రియూటర్స్ రిపోర్ట్ ప్రకారం, ఇది ‘లాంగ్‌స్టాండింగ్ పాలసీ మార్పు‘ కావచ్చు. ఇది బంగ్లాదేశ్‌తో లింక్? చిట్టగాంగ్ మయన్మార్ సరిహద్దుకు సమీపంలో ఉంది. వ్యూహాలు ఇక్కడ జరగడం, మయన్మార్ రెబెల్స్‌ను కోర్ట్ చేయడానికి అమెరికా స్ట్రాటజీగా చూస్తున్నారు. భారత్ కోసం కాదు, మయన్మార్ మినరల్స్ కోసమే అని విశ్లేషకులు అంచనా.
భారత్, చైనా పరిణామాలు..
చిట్టగాంగ్ భారత్ నార్త్–ఈస్ట్‌కు సమీపం. అమెరికా ప్రెజెన్స్ చైనా కౌంటర్ అయినా, రీజియనల్ స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది. మయన్మార్‌లో భారత్–మయన్మార్ జాయింట్ ఎక్సర్‌సైజ్‌లు జరుగుతున్నాయి. చైనా బంగ్లాదేశ్‌లో కార్యకలాపాలు (బెల్ట్ అండ్ రోడ్) పెరిగితే, భారత్ అప్రమత్తంగా ఉండాలి. డీల్ కుదిరితే మయన్మార్‌కు ఆంక్షలు ఎత్తివేయడం లాభం. కానీ చైనా ఆధిపత్యం ఇంకా బలంగా ఉంది.