https://oktelugu.com/

Neurologist: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే.. భర్తలకు తిరుగుండదు

సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలను అబ్బాయిలు పెళ్లి చేసుకుంటే వారికి జీవితాంతం ఇక తిరుగు ఉండదని న్యూమరాలజిస్ట్‌లు చెబుతున్నారు. మరి అబ్బాయిలు ఏ తేదీలో పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే కలసి వస్తుందో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 18, 2024 / 11:00 PM IST

    marriage

    Follow us on

    Neurologist: పెళ్లి చేసుకునే భార్య గురించి అబ్బాయిలు ఎన్నో కలలు కంటారు. అర్థం చేసుకునే భార్య రావడంతో పాటు అదృష్టం కలిసి రావాలని కోరుకుంటారు. అన్ని విధాలుగా కూడా సెట్ అయ్యే అమ్మాయి జీవితంలోకి వస్తే సాఫీగా సాగుతుందని అబ్బాయిలు భావిస్తారు. అదే అర్థం చేసుకుని భాగస్వామి రాకపోతే జీవితం ఓ నరకంలా ఉంటుంది. ఈ రోజుల్లో చాలా మంది పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే విడిపోతున్నారు. వ్యక్తిగత కారణాలు, కెరీర్, అర్థం చేసుకోలేక పోవడం వంటి విషయాల వల్ల విడిపోతున్నారు. అయితే ఒక్కోరి ప్రవర్తన ఒక్కోలా ఉంటుంది. వీటితో పాటు కొందరి జాతకం వల్ల పెళ్లి చేసుకునే భర్తలకు కలిసి వస్తుంది. చాలా మంది సంఖ్యా శాస్త్రాన్ని నమ్ముతారు. అయితే ఒక్కోరు పుట్టిన తేదీల బట్టి వారి ప్రవర్తన ఉంటుంది. అలాగే వారికి అదృష్టం కూడా కలసి వస్తుంది. అయితే సంఖ్యా శాస్త్రం ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలను అబ్బాయిలు పెళ్లి చేసుకుంటే వారికి జీవితాంతం ఇక తిరుగు ఉండదని న్యూమరాలజిస్ట్‌లు చెబుతున్నారు. మరి అబ్బాయిలు ఏ తేదీలో పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే కలసి వస్తుందో చూద్దాం.

    అబ్బాయిలు 5, 14, 23వ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే వారి జీవితం రంగులమయమే. జీవితంలో ఉన్న దురదృష్టమంతా పోయి.. వారి జీవితంలోకి అదృష్టం వస్తుంది. ఈ తేదీల్లో పుట్టిన మహిళలు చాలా తెలివిగా ఉంటారు. భర్తలను గౌరవిస్తారు. అన్ని విషయాల్లో కూడా సపోర్ట్‌గా ఉంటారు. భర్త విజయం వెనుక ఉంటారు. ఈ మూడు తేదీల్లో ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం వల్ల భర్తలకు ఉద్యోగం, వ్యాపారం అన్నింట్లో కూడా పదోన్నతి కలుగుతుంది. కేవలం భర్తకు మాత్రమే కాకుండా ఇంటికి కూడా మంచి జరుగుతుంది. ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చినట్లు అనిపిస్తుంది. అలాగే అత్త మామను గౌరవిస్తుంది. ఇంటిని, కుటుంబ బాధ్యతలను చూసుకుంటారు. ఎల్లప్పుడూ ఇంట్లో సంతోషం ఉండేలా వీరు కుటుంబాన్ని నడిపిస్తారు. ఎలాంటి కష్టం వచ్చిన కూడా ఒక సపోర్ట్ సిస్టమ్‌గా ఉంటారు. ఇలాంటి అమ్మాయిలు ఒక అబ్బాయి లైఫ్‌లో ఉంటే వారి జీవితంలో అసలు తిరుగు ఉండదు. ఎంతటి కష్టాన్ని అయిన దాటేస్తారు. ఎలాంటి సమస్యలు రాకుండా వారికి భార్య వల్ల ధైర్యం వస్తుంది. ఒక మగాడి విజయం వెనుక ఆడది ఉంటుందని అనడానికి ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు నిదర్శనమని న్యూమరాలిజిస్ట్‌లు అంటున్నారు. అబ్బాయిలు మీరు పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలను చూడండి. వీరి ప్రవర్తన, స్వభావం అన్ని కూడా మీ కుటుంబ విలువలు పెంచే విధంగానే ఉంటాయి. కానీ తగ్గించే విధంగా ఉండవు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలన్నీ కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.