Ugadi 2022: ఆయుర్వేదంలో వేపచెట్టుకు ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో తెలిసిందే. ఇంటి ముందు వేపచెట్టు ఉంటే చాలు దాని గాలితో ఆరోగ్యం సిద్ధిస్తుందని చెబుతారు. అందుకే వేపచెట్టును అన్ని మందుల్లో వాడతారు. ఈనేపథ్యంలో ఉగాది పచ్చడిలో ప్రముఖ పాత్ర పోషించే వేపపువ్వు ప్రాధాన్యం అందరికి విధితమే. దీంతో ఉగాది పచ్చడిలో ప్రస్తుతం వేపవువ్వు వేయాలా? వద్దా? అనే సందేహాలు అందరిలో వస్తున్నాయి.

ఉగాది పచ్చడిలో వేపపువ్వు ప్రత్యేకతే వేరు. దాంతోనే రుచి పెరుగుతుంది. ఉగాది పచ్చడికి వేపపువ్వు చేదుతోనే ప్రజలకు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే ఇటీవల వేప చెట్టుకు తెగుళ్ల బెడద అంటుకుంది. దీంతో ఈ సారి వేపపువ్వు వాడాలా? వద్దా అనే సందేహాల్లో ప్రజలు ఉన్నారు. దీనిపై ఆచర్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాక్టర్ జగదీశ్వర్ స్పష్టత ఇచ్చారు. వేపపువ్వు వాడుకోవాలని సూచిస్తున్నారు.
Also Read: Janasena Party Protest : ‘పవర్ స్టార్’.. ‘పవర్’ చూపిస్తున్నాడుగా!
వేపచెట్టుకు తెగుళ్లు సోకడంతో ఉగాది పచ్చడిలో దాన్ని వేయాలా? ఊరుకోవాలా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ అలాంటి అనుమానాలు అక్కరలేదని చెబుతున్నారు. వేపచెట్టుకు తెగులు తాత్కాలికమేనని ప్రకటిస్తున్నారు. ఉత్తరాఖండ్ అడవుల నుంచి వ్యాపించిన వైరస్ వల్ల చెట్లకు తెగుళ్లు అంటుకున్నాయని తెలిపారు. దీంతో వేపచెట్టు పూత వేసి పచ్చడి రుచిగా తయారు చేసుకోవాలని స్పష్టత ఇచ్చారు.

వేపచెట్టుకు తెగులు సోకిందని దాన్ని పచ్చడిలో వాడకుండా ఉండొద్దని చెబుతున్నారు. వేపచెట్టు పూతతోనే ఉగాది పచ్చడి చేస్తే మజా ఉంటుంది. దాని గురించి ప్రజలు కూడా ఉత్సాహంగా ఉన్నట్లు ఆనవాయితీయే. దీంతో పచ్చడికి పరమార్థంగా భావించి వేపపువ్వును అందులో చేర్చుకుంటారు. ఆరోగ్యానికి ఆయుష్షునిచ్చే విధంగా వేపపువ్వు వాడుకుని ప్రజలు తమ వాంఛ తీర్చుకుంటారు. అధికారుల సూచనతో వేపవుప్వు ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: Regional Ring Road: ఆర్ఆర్ఆర్ కు కేంద్రం సై: హైదరాబాద్ చుట్టూ మరో మణిహారం