https://oktelugu.com/

Smartphone Tips: మొబైల్ ఫాస్ట్ గా ఛార్జింగ్ అవ్వాలా? ఈ చిన్న ట్రిక్ ఫాలో అవండి..

ఉద్యోగ, వ్యాపారరీత్యా చాలా మంది బిజీగా మారారు. దీంతో ప్రత్యేకంగా ఫోన్ చార్జింగ్ కోసం టైం వేస్టు చేసుకోవాలని ఎవరూ అనుకోరు. ఈ క్రమంలో మొబైల్ త్వరగా ఛార్జింగ్ కావడానికి ఫాస్ట్ ఛార్జర్లు కొనుగోలు చేస్తున్నారు. ఇవి బ్రాండెడ్ అయితే ఓకే..

Written By:
  • Srinivas
  • , Updated On : August 16, 2023 / 11:46 AM IST

    Smartphone Tips

    Follow us on

    Smartphone Tips: నేటి కాలంలో ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ తప్పనిసరిగా ఉంటుంది. ఒకదశలో మొబైల్ లేకపోతే రోజూ గడవదు అన్నట్లుగా తయారైంది. ఆయా అవసరాల రీత్యా ఫోన్ ను రకరకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొందరు మొబైల్స్ ను ఉపయోగించడమే గానీ దాని గురించి పట్టించుకోరు. ముఖ్యంగా ఫోన్ ఛార్జింగ్ విషయంలో చిన్న చిన్న మిస్టేక్ చేస్తూ బ్యాటరీ పాడయ్యే వరకు చూస్తారు. ప్రతీ మొబైల్ సక్రమంగా పనిచేయాలంటే కనీసం 20 శాతం ఛార్జింగ్ తప్పనిసరిగా ఉండాలి. దీనికి తక్కువగా ఉన్నా మొబైల్ పనిచేస్తుంది. కానీ రాను రాను బ్యాటరీ వ్యవస్థ డౌన్ అవుతుంది. కొన్ని మొబైల్స్ ఫుల్ ఛార్జింగ్ కావడానికి చాలా సమయం తీసుకుంటాయి. దీంతో బిజీ ఉన్నవారిని ఇబ్బంది పెడుతుంది. ఈ తరుణంలో మొబైల్ ఛార్జింగ్ త్వరగా కావాలంటే చిన్న ట్రిక్స్ ను ఫాలో అయితే సరిపోతుంది. ఆ ట్రిక్స్ ఏంటంటే?

    ఉద్యోగ, వ్యాపారరీత్యా చాలా మంది బిజీగా మారారు. దీంతో ప్రత్యేకంగా ఫోన్ చార్జింగ్ కోసం టైం వేస్టు చేసుకోవాలని ఎవరూ అనుకోరు. ఈ క్రమంలో మొబైల్ త్వరగా ఛార్జింగ్ కావడానికి ఫాస్ట్ ఛార్జర్లు కొనుగోలు చేస్తున్నారు. ఇవి బ్రాండెడ్ అయితే ఓకే.. కానీ కొన్ని ఫేక్ ఫాస్ట్ ఛార్జింగ్ లు ఉపయోగించడం వల్ల ఫోన్ లోని బ్యాటరీ పాడవుతుంది. అయితే ఎలాంటి ఫాస్ట్ ఛార్జర్లు అవసరం లేకుండా ఫోన్ లోనే చిన్న ట్రిక్స్ తో తొందరగా ఛార్జింగ్ అయ్యేలా చేసుకోండి. ఇందుకోసం ఏం చేయాలంటే..

    మొబైల్ ఫోన్ బ్యాటరీ డౌన్ కాగానే వెంటనే ఛార్జర్ పెట్టేస్తారు. కానీ ఆ ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ముందే యాప్స్ క్లోజ్ చేసుకోవాలి. వీటితో పాటు ఇంటర్నెట్ కూడా ఆఫ్ చేయాలి. ఇంటర్నెట్ ఆన్ లో ఉండి యాప్స్ కూడా క్లోజ్ చేయకపోతే బ్యాగ్రౌండ్ లో అవి రన్ అవుతాయి. దీంతో మీ ఫోన్ చార్జింగ్ పెట్టినా త్వరగా పూర్తవదు. చాలా సమయం తీసుకుంటుంది. అందువల్ల ముందు యాప్స్ తో పాటు ఇంటర్నెట్ కూడా పూర్తిగా ఆఫ్ చేసిన తరువాత ఛార్జింగ్ పెడితే ఫాస్ట్ గా ఛార్జింగ్ అవుతుంది.

    మొబైలో ఎయిర్ ప్లేన్ మోడ్ గురించి అందరికీ తెలిసిందే. ఇది తొందరగా ఛార్జింగ్ కావడానికి ఉపయోగపడుతుంది. మొబైల్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఎయిర్ ప్లేన్ మోడ్ ఆన్ చేసి ఉంచండి. దీనిని ఆన్ చేయడం వల్ల మొబైల్ కు సంబంధించి ఇంటర్నెట్ తో పాటు జీపీఎస్ కూడా ఆఫ్ అవుతుంది. అయితే ఈ సమయంలో మీకు ఎలాంటి కాల్స్ కూడా రావు. అత్యవసరం లేదు అనుకుంటే ఎయిర్ ప్లేన్ మోడ్ ఆన్ చేసి ఛార్జింగ్ పెడితే మంచి ఫలితం ఉంటుంది.

    చాలా పనులకు యాప్స్ ఎంతో యూజ్ అవుతున్నాయి. అలాగే ఫాస్ట్ గా ఛార్జింగ్ కావడానికి కొన్ని యాప్స్ పుట్టుకొస్తున్నాయి. కానీ ఇలాంటివి నమ్మకపోవడమే మంచింది. ఎందుకంటే ఈ యాప్ లతో మిగతా వాటికి నష్టం అయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల ఫాస్ట్ చార్జింగ్ కోసం యాప్స్ జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఇక ఫాస్ట్ చార్జింగ్ కోసం నార్మల్ ఛార్జర్లు కాకుండా బ్రాండెడ్ వి మాత్రమే కొనుగోలు చేయండి. అప్పుడే ఫోన్ ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా ఉంటుంది.