MWP Insurance: ఒక వ్యక్తి ప్రస్తుతం అవసరాలు తీరడంతో పాటు భవిష్యత్ లోని కొన్ని పనుల కోసం డబ్బును ఆదాచేస్తారు. అయితే సాధారణ సేవింగ్ కంటే పెట్టుబడుల రూపంలో దీనిని జమచేయడం వల్ల ఫ్యూచర్లో వీటికి వడ్డీ వచ్చి చాలా ఉపయోగపడుతాయి. అలాగే ఇన్సూరెన్స్ ల రూపంలో ఇన్వెస్ట్ మెంట్ చేస్తే రిటర్న్స్ రావడంతో పాటు కుటుంబానికి రక్షణగా ఉంటుంది. నేటి కాలంలో ఇన్సూరెన్స్ పై అవగాహన కలుగుతోంది. దీంతో రకరకాల పాలసీలు తీసుకుంటున్నారు. అయితే చాలా మందికి MWP చట్టం ఇన్సూరెన్స్ గురించి తెలియదు. మిగతా ఇన్సూరెన్స్ ల కంటే ఈ ఇన్సూరెన్స్ ద్వారా అధిక ఆదాయం పొందుతారు. అంతేకాకుండా ఒక కుటుంబానికి నిజమైన రక్షణ ఈ పాలసీనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మరి దీని గురించి తెలుసుకుందామా..
MWP(Marriage Women Protect) Act ఇన్సూరెన్స్ ఉన్నదన్న విషయం చాలా మందికే తెలుసు. దీని గురించి తెలుసుకోవాలంటే ముందు ఒక అవగాహన రావాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తూ కొన్ని అవసరాల కోసం రూ. 5 లక్షల వరకు బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థల ద్వారా అప్పులు చేశాడు. ఇదే సమయంలో రూ.2 లక్షల పాలసీ తీసుకున్నారు. అయితే కొన్ని రోజుల తరువాత ఆ వ్యక్తి ప్రమాదవశాత్తూ మరణించాడు. దీంతో ఆ వ్యక్తి అప్పును సదరు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు ఆయన చేసిన ఇన్సూరెన్స్ ద్వారా తీసుకునే వీలుంది. ఆ వ్యక్తి ఎంతైతే అప్పుడు ఉన్నాడో.. ఆ మొత్తాన్ని పాలసీ ద్వారా తీసుకుంటారు.
ఈ క్రమంలో వ్యక్తితో సంబంధం ఉన్న కుటుంబానికి ఎలాంటి ఆదాయం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతుంది. అంటే వ్యక్తి ఇన్సూరెన్స్ మొత్తం అప్పులకే వెళ్తుంది. కానీ MWP ద్వారా ఇన్సూరెన్స్ తీసుకుంటే అలా జరగదు. ముందుగానే దీని ద్వారా ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి. పై పరిస్థితి ఏర్పడినప్పుడు ఇన్సూరెన్స్ డబ్బులు మొత్తం చెల్లించడానికి ఆ వ్యక్తికి సంబంధించిన భార్య, పిల్లలకు మొదటి ప్రాధాన్యం ఇస్తారు. ఈ ఇన్సూరెన్స్ మొత్తం వారికి చెల్లించిన తరువాత వారు ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు. కానీ వ్యక్తి చేసిన అప్పులను పరిగణలోకి తీసుకోంది.
అయితే ఈ ఇన్సూరెన్స్ తీసుకోనే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండబ్ల్యూపీ ఇన్సూరెన్స్ మహిళల ఆస్తి చట్టం కింద తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఈ మొత్తం భార్య లేదా పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. సాధారణ ఉద్యోగుల నుంచి వ్యాపారులు సైతం ఈ పాలసీని తీసుకోవచ్చు. కానీ ఒక్కసారి పాలసీ తీసుకున్న తరువాత ఎటువంటి మార్పులు ఉండవు. అలాగే నామినిని ఒక్కసారిగా చేర్చిన తరువాత మరోనామినిని చేర్చరాలు. ఇక తల్లిదండ్రులకు ఈ పాలసీ వర్తించదు. మరో విషయమేంటంటే ఈ పాలసీ మొత్తం భవిష్యత్ లో ఎవరికి ఎంత శాతం ఇవ్వదలుచుకున్నారో.. ముందే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: Mwp insurance are the debts high if you take this policy you are safe
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com