Munagaku Health Benefits: మునగ చెట్టు ఎన్నో ఆయుర్వేద లక్షణాలు కలిగి ఉన్నాయి. దీనిలోని ఆకులు, కాయలు, బెరడు కూడా మనకు ఉపయోగపడుతుంది. అందుకే మునగ చెట్టును ఇప్పుడు ప్రొటీన్లు ఉన్న చెట్టుగా గుర్తిస్తున్నారు. ఆకుల్లో మునగ, కరివేపాకుల్లో ఉండే పోషకాలే ఎక్కువ. పెరటి చెట్టు మందులకు పనికి రాదన్నట్లు అందులో ఉండే పోషకాల గురించి తెలిసే వరకు దాన్ని ఎవరు ముట్టుకోలేదు. తెలిసిన తరువాత కూడా దాని కాయలు మాత్రమే తినేవారు. కానీ ఇప్పుడు దాని ఆకులు, బెరడు కూడా వాడుతున్నారు.
ఆఫ్రికన్ దేశాలు
మునగాకు ప్రాధాన్యం గురించి ఆఫ్రికన్ దేశాలు ముందే గుర్తించాయి. దాని ప్రాధాన్యం గురించి ప్రపంచానికి తెలియజేశారు. మునగ చెట్టుతో పోషకాహార లోపం నివారించే సత్తా ఉందని అధ్యయనాల తెలియజేసింది. దీంతో అప్పటి నుంచి వారు మునగ చెట్టును ఆరాధించారు. మునగాకు టీతో తల్లులకు పాలు అధికంగా పడ్డాయని వెల్లడైంది. మునగాకు పొడిని కూడా వాడుతున్నారు.
చెట్టులోని అన్ని భాగాలు..
అమెరికాకు చెందిన ద ట్రీస్ ఫర్ లైఫ్ అనే స్వచ్ఛంద సంస్థ చెట్టులోని అణువణువు ఉపయోగపడుతుందని తేల్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఇది ఓ సంజీవనిగా గుర్తించబడింది. ఐక్యరాజ్య సమితి కూడా మునగ చెట్టు ప్రాధాన్యతను ప్రోత్సహించింది. రోజు కాస్త మునగాకు తినడం వల్ల వందేళ్లు బతకొచ్చని తెలుస్తోంది. మునగాకులో ఎన్నో పోషకాలున్నాయి.
మునగాకును కూరగా..
మునగాకు మనకు ఎన్నో రోగాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వంద గ్రాముల ఎండిన ఆకుల్లో పాలకన్నా 17 రెట్లు కాల్షియం ఉంటుంది. అందుకే మునగాకును తినడం అలవాటుగా చేసుకోవడం మంచిది. మునగాకును పప్పులో వేసుకుంటే భలే రుచిగా ఉంటుంది. మునగాకు పొడిని కూడా కూరల్లో వేసుకుంటే మంచి ప్రొటీన్లు అందుతాయి. 300 రకాల వ్యాధులను నివారించగల సత్తా ఇందులో ఉంటుంది. మధుమేహం, బీపీ, కొలెస్ట్రాల్ వంటి రోగాలకు మందులా పనిచేస్తుంది.
రక్తహీనతకు చెక్
రక్తహీనతతో బాధపడే వారికి కూడా మంచి ఆహారమే. గాయాలపై మునగాకు పేస్టు రాస్తే ఉపశమనం ఉంటుంది. మనగాకును వేడి చేసుకుని అన్నంలో వేసుకుని తింటే ఐరన్, రక్తం పెరుగుతుంది. ఇందులో బీటాకెరోటిన్ వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉంటాయని ఆయుర్వేద వైద్య నిపుణులు సూచిస్తున్నారు.