Ravi Shastri: IPl అభిమానుల్లో ఎంతో ఆసక్తిరేపే మ్యాచులు ఏవైనా ఉన్నాయంటే అవి ఖచ్చితంగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచే. నువ్వా నేనా అన్నట్లు సాగే ఈ రెండు టీంల మధ్య మ్యాచ్ అంటే అందరికీ ఎంతో ఆసక్తి. ఇప్పటి వరకు నమోదైన రికార్డులు కూడా ఈ రెండు టీంల మధ్య ఎంత పోటీ ఉంటుందనే విషయం అర్థమవుతోంది. IPLలో ఇప్పటి వరకు జరిగిన అన్ని సీజన్లలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఉందంటే.. క్రీడాభిమానులకు అదో ఊపు.

ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఇప్పటి వరకు IPL చరిత్రలో మొత్తం 30 మ్యాచులు జరిగాయి. అందులో 16 మ్యాచుల్లో ఢిల్లీపై ముంబై విజయం సాధించింది. అదే సమయంలో ఢిల్లీ 14సార్లు విజయం సాధించింది. 2020లో ఈ రెండు జట్ల మధ్య మూడు మ్యాచులు జరగగా.. ఢిల్లీపై ముంబై గెలిచింది. 2021లో ఈ రెండు టీంల మధ్య రెండు మ్యాచులు జరగ్గా.. ఢిల్లీ గెలిచింది. మొత్తానికి ఓ రకంగా చూస్తే ఢిల్లీ మీద ముంబై పైచేయి సాధిస్తూ వస్తోంది.
Also Read: డబుల్స్ ఛాంపియన్ షిప్ లో అదరగొట్టిన దీపికా పల్లికల్.. ఒకే రోజు రెండు గోల్డ్ మెడల్స్..
అయినా గానీ ఈ రెండు జట్ల మధ్య మ్యాచు జరుగుతుందంటే మాత్రం క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ముంబై ఇండియన్స్ జట్టుకు రోహిత్ శర్మ బలంగా నిలుస్తున్నారు. అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీంని గాడిలో పెడుతున్న రిషబ్ పంత్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. కాగా ఈ రెండు టీంలకు బ్యాటింగ్ బలంగా నిలవగా.. బౌలింగ్ విషయంలో రవిశాస్త్రి ఆసక్తికర కామెంట్లు చేశాడు. IPL 2022లో ఇప్పుడు రవిశాస్త్రి మాటలు క్రీడాభిమానుల మధ్య చర్చకు దారి తీసింది.

ఇంతకీ రవిశాస్త్రి ఏమన్నాడంటే..
ఐపీఎల్ లో హాట్ ఫేవరెట్ టీంలుగా నిలిచే ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ టీంలలో బౌలింగ్ బలహీనంగా ఉన్నట్లు రవిశాస్త్రి కామెంట్ చేశాడు. రెండు జట్లకు రెండు విభిన్న బలాలు ఉన్నా బౌలింగ్ విషయానికి వస్తే రెండు జట్లు బలహీనంగా ఉన్నాయని అన్నాడు. పాండ్యా బ్రదర్స్ లేకపోతే బౌలింగ్ విషయం గురించి మాట్లాడటం కూడా వేస్ట్ అని అన్నాడు. అటు ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో రబాడా లాంటి మేటి బౌలర్ లేకపోవడం ఖచ్చితంగా టీంకు లోటే అని రవిశాస్త్రి వెల్లడించాడు.
[…] […]