Special for Mother’s Day: అమ్మను మించి దైవమున్నదా… ఆత్మను మించి అర్థమున్నదా అన్నారో సినీకవి అమ్మలోని కమ్మదనం.. సృష్టిలోనే తియ్యదనం అనేది తెలిసిందే. తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే. తన ప్రాణాలు పోతాయని తెలిసినా బిడ్డకు మాత్రం జన్మనిచ్చి మురిసిపోతుంది. ఎదిగే క్రమంలో వారిని పెంచేందుకు నానా తంటాలు పడుతుంది. అహర్నిశలు పిల్లల సంక్షేమమే ధ్యేయంగా తన సర్వస్వాన్ని ధారపోతస్తుంది. తండ్రి అవసరాలు తీరిస్తే తల్లి కడుపు నింపే పనిని బాధ్యతగా తీరుస్తుంది. పిల్లలకు చిన్న సమస్య వచ్చినా తల్లడిల్లుతూ తల్లి మనసు విలవిలలాడుతుంది.
అది కార్యాలయమైనా, ఇళ్లైనా ఇంకా ఏదైనా తన పిల్లల గురించే ధ్యాస. వారి ఎదుగుదల పైచే తపన. పిల్లలు పెరిగి పెద్దవారైనా తల్లికి చిన్న పిల్లల్లాగే కనిప్తారు. నిత్యం వారి అభ్యుదయం కోసం తపన పడుతుంటుంది. ప్రతి సంవత్సరం మే నెల రెండో ఆదివారం మదర్స్ డేగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పిల్లల ఎదుగుదలలో తల్లి పాత్ర కీలకం. వారికి అండగా నిలుస్తూ అడుగడుగునా ప్రోత్సహిస్తూ వారిని మంచి మార్గంలో నడిపించే గురువే అమ్మ.

మదర్స్ డే నిర్వహించుకోవాలనే ఆలోచన అమెరికాలో ప్రారంభమైంది. అక్కడ ఓ వ్యక్తి తన తల్లి చనిపోయి మూడేళ్లయిన సందర్భంగా మదర్స్ డే జరుపుకోవాలని భావించాడు దీంతో అక్కడ మదర్స్ డే జరుపుకోవడం మొదలుపెట్టారు. 1914లో అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ దీన్ని జాతీయ సెలవు దినంగా ప్రకటించారు. అప్పటి నుంచి మదర్స్ డే జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది మే నెల రెండో ఆదివారం మదర్స్ డేగా చేస్తున్నార.
Also Read: CM Jagan and Roja Tongue Slip : సీఎం జగన్, రోజా టంగ్ స్లిప్.. వీళ్లకు జర తెలుగు నేర్పండయ్యా!
జన్మనిచ్చిన తల్లిని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత పిల్లలదే. కానీ ఎంతమంది అలా చేస్తున్నారు. ఓ సారి గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి. కన్న వారిని అసహ్చించుకునే వారే ఎక్కువ. కన్నవారి రుణం తీర్చుకునే వారే నిజమైన బిడ్డలు. మన సమాజంలో తల్లిదండ్రిని దగ్గరకు తీసుకోని వారే అడుగడుగునా కనిపిస్తారు. ఎంత మంది ముసలివారు తమ పిల్లలు సాకడం లేదని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారో తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తల్లి ప్రేమకు వెలకట్టే వారు ఉండటం గమనార్హం.

ఇంకా కొందరైతే బతికున్నప్పుడు ఏమి పెట్టకుండా చనిపోయినాక విగ్రహాలు పెట్టించడం, పూజలు చేయడం చేస్తుంటారు. ఇవన్నీ వృథా వారు ఉన్నప్పుడే వారి కోరికలు తీర్చడం పిల్లలుగా మన కర్తవ్యం. కానీ ఎంత మంది అలా చేస్తున్నారు. కన్న వారి రుణం తీర్చుకునే క్రమంలో ఎందరు అక్కున చేర్చుకుంటున్నారు. అంటే సమాధానమే లేదు. నూటికో కోటికో ఒకరు కనిపిస్తుంటారు. మదర్స్ డే అంటే ఏదో ఉత్సవం జపురుకోవడం కాదు వారికి ఇంత అన్నం పెట్టడమే. వారిని లాలించి కోరికలు తీర్చి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత పిల్లలుగా మనదే.
అమ్మ అనే కమ్మనైన పదం మనకు నడక నేర్పింది. అన్నింటా గురువుగా మారి కష్టాల్లో సుఖాల్లో తోడు నీడగా నిలిచేదే అమ్మ. బ్రహ్మ అయినా ఓ అమ్మకు పుట్టాల్సిందే. అమ్మకున్న గొప్పదనం అలాంటిది. కన్న తల్లి గురించి ఎంతో గొప్పగా చెబుతున్నా పరిస్థితుల్లో అన్ని వైరుధ్యంగా ఉండటం తెలిసిందే. భవిష్యత్ తరాలకు బాట వేయాల్సిన మనమే దారి తప్పుతున్నాం. కన్నవారికి ఇంత అన్నం పెట్టేందుకు కూడా ముందుకు రాని పిల్లలు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఏదో తూతూ మంత్రంగా వేడుకలు నిర్వహించడం కాదు. వారి బాధలు తీర్చడం. వారికి ఏం కావాలో చూసుకోవడం మన బాధ్యత. దాన్ని ఎంత మంది సక్రమంగా నిర్వహిస్తున్నారు. ఎంత మంది కన్న వారిని బాగా చూసుకుంటున్నారో వారికే తెలియాలి.
Also Read: Nani- Sagar Chandra: నానితో పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సినిమా ఫిక్స్