Mother : తల్లి బిడ్డ మధ్య సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తల్లులు తమ పిల్లలను చాలా జాగ్రత్తగా పెంచుకుంటారు. తల్లి బిడ్డల మధ్య సంబంధం ప్రపంచంలోని అత్యంత ప్రత్యేకమైన సంబంధాలలో ఒకటి. ఎంత బిజీగా ఉన్నప్పటికీ వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. బిడ్డకు తల్లి పాలు చాలా ముఖ్యం. సాధారణ పాల కంటే బ్రెడ్ ఫీడింగ్ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లి, బిడ్డ ఇద్దరికీ ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే తల్లి స్వరం పిల్లలకు సురక్షితమైన, ప్రశాంతమైన ప్రదేశం, కానీ తల్లి గొంతు వినగానే, మన శరీరంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి, అది మనకు రిలాక్స్‌గా అనిపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందో.. తల్లి స్వరం మన శరీరం, మనస్సుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.
తల్లి స్వరం మాయాజాలం
అమ్మ గొంతు వినగానే మనం ప్రశాంతంగా, సురక్షితంగా ఉంటుంది. ఇది మాటలలో వర్ణించడం కష్టమైన అద్భుతమైన అనుభవం. కానీ తల్లి స్వరం మన శరీరం, మనస్సుపై లోతైన ప్రభావాన్ని చూపుతుందని సైన్స్ ధృవీకరించింది.
ఆక్సిటోసిన్ అంటే ఏమిటి?
అమ్మ గొంతు వినగానే మన శరీరంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. అందుకే దీన్ని లవ్ హార్మోన్ అని కూడా అంటారు. ఆక్సిటోసిన్ మన శరీరాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది.
ఒత్తిడిని తగ్గిస్తుంది: ఆక్సిటోసిన్ ఒత్తిడి హార్మోన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. మనం ఒత్తిడికి గురైనప్పుడు, మన శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయి పెరుగుతుంది. ఆక్సిటోసిన్ కార్టిసాల్ స్థాయిలను తగ్గించడం ద్వారా మనల్ని ప్రశాంతంగా ఉంచుతుంది.
గుండె ఆరోగ్యంగా ఉంచుతుంది: ఆక్సిటోసిన్ రక్తపోటును తగ్గించడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది: ఆక్సిటోసిన్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం ద్వారా వ్యాధుల నుండి మనలను రక్షిస్తుంది.
సామాజిక అనుబంధాన్ని పెంచుతుంది: ఆక్సిటోసిన్ ఇతరులతో కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. సామాజిక సంబంధాలను బలోపేతం చేస్తుంది.
మెదడుపై ప్రభావం ఏమిటి?
తల్లి గొంతు వినడం వల్ల మన మెదడులో చాలా మార్పులు వస్తాయి. భావోద్వేగాలు, జ్ఞాపకాలతో ముడిపడి ఉన్న మెదడు భాగం తల్లి గొంతు వినగానే చురుకుగా మారుతుంది. ఇది మనల్ని సురక్షితంగా, ప్రేమించే అనుభూతిని కలిగిస్తుంది. చిన్నతనంలో తల్లి స్వరం వినడం వల్ల మన మెదడు అభివృద్ధి చెందుతుంది. మన భావోద్వేగ మేధస్సు పెరుగుతుంది. పిల్లలు కూడా తమ తల్లి గొంతు విన్న తర్వాత భాషలను నేర్చుకోవడంలో వేగంగా అభివృద్ధి చెందుతారు. పెద్దయ్యాక కూడా అమ్మ గొంతు మనపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మనం ఒత్తిడికి గురైనప్పుడు, అమ్మ గొంతు వినడం ద్వారా తక్షణ ఉపశమనం పొందుతాము. ఇది మన సమస్యలను మరచిపోవడానికి.. కొన్ని క్షణాలు ప్రశాంతంగా ఉండటానికి తోడ్పడుతుంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Mother does anyone know why tension decreases after talking to mother
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com