Mother Dairy Franchise: కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రతి నెలా అదిరిపోయే రాబడిని పొందాలని భావించే వాళ్లకు తీపికబురు చెప్పింది. వేర్వేరు స్కీమ్ ల ద్వారా కేంద్ర ప్రభుత్వం రుణాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం అమలు చేస్తున్న ముద్ర స్కీమ్ ద్వారా 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు రుణాన్ని పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే ఇలా పొందే రుణంతో డెయిరీ ఫ్రాంఛైజ్ తీసుకుంటే మంచి లాభాలను పొందవచ్చు.

మదర్ డెయిరీ తమతో కలిసి వ్యాపారం చేసేందుకు పెద్దఎత్తున అవకాశాలను కల్పిస్తుండటం గమనార్హం. ఈ సంస్థ పాలు, పాల ఉత్పత్తులతో పాటు ఇతర ఆహార ఉత్పత్తులను విక్రయిస్తోంది. దేశంలోని టాప్ 100 కంపెనీలలో మదర్స్ డైరీ 39వ స్థానంలో ఉంది. ఈ సంస్థకు దేశంలో 2,500 రిటైల్ అవుట్ లెట్లు ఉన్నాయి. ఈ సంస్థ క్రమంగా నెట్వర్క్ ను విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది.
పెద్దగా పెట్టుబడి లేకుండానే ఈ ఫ్రాంఛైజీ బిజినెస్ ద్వారా లాభాలు సంపాదించుకునే ఛాన్స్ ఉంటుంది. రుణం తీసుకునే వాళ్ల కంటే సొంతంగా ఇన్వెస్ట్ చేసేవాళ్లు ఎక్కువ మొత్తంలో లాభాలను పొందే అవకాశం ఉంటుంది. 50,000 రూపాయలను బ్రాండ్ ఫీజుగా మదర్ డెయిరీ కోసం చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటరు ఐడికార్డులను ఇవ్వడం ద్వారా ఫ్రాంఛైజీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
మదర్ డెయిరీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా నెలకు 44,000 రూపాయల వరకు ఆదాయం పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని తిరిగి పొందాలంటే రెండు సంవత్సరాల సమయం పడుతుంది.