దేశంలో చాలామంది తక్కువ ఖర్చుతో కొత్త కారును కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. ప్రముఖ కార్ల కంపెనీలలో ఒకటైన టాటా మోటార్స్ కొత్త కార్లను కొనుగోలు చేయాలని భావించే వాళ్లకు శుభవార్త చెప్పింది. కేవలం నెలకు రూ.4111 చెల్లించడం ద్వారా కొత్త కారు సొంతమవుతుంది. అయితే ఈ విధంగా కారును కొనుగోలు చేయాలంటే కొన్ని షరతులు ఉన్నాయి. సెడాన్ టాటా టిగోర్ ను కొనుగోలు చేయడం ద్వారా తక్కువ ఈఎంఐకు కారు సొంతమవుతుంది.
ఈ కారు ధర 5,64,000 రూపాయలు కాగా వేరియంట్లను బట్టి కార్ల ధరలలో మార్పులు ఉంటాయి. ఈ కారు గరిష్ట ధర 7,81,000 రూపాయలుగా ఉంది. టాటా టిగోర్ కారు ఆటోమాటిక్ ఆప్షన్ తో పాటు మాన్యువల్ ఆప్షన్ తో అందుబాటులో ఉంటుంది. మాన్యువల్ కారు ధర తక్కువ కాగా ఆటోమేటిక్ కారు ధర ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ కారు 1.2 లీటర్ ఇంజిన్ ను కలిగి ఉంటుందని సమాచారం.
టాటా మోటార్స్ వెబ్ సైట్ ద్వారా ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. వెబ్ సైట్ లో వివరాలను పొందుపరచడం ద్వారా కంపెనీ డీలర్ షిప్ నుంచి కాల్ పొందవచ్చు. కారు వివరాలను తెలుసుకుని కారు ఫీచర్లు నచ్చితే ఆ కారును కొనుగోలు చేస్తే మంచిది. కొత్త కారును కొనుగోలు చేయాలని భావించే వాళ్లు ఈ కారును కొనుగోలు చేస్తే ప్రయోజనం చేకూరుతుంది.
మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఈ కారు ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. నెలకు 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు వేతనం వచ్చే వాళ్లకు ఈ కారు వల్ల ప్రయోజనం చేకూరుతుంది. ఎక్కువ ఆదాయం వచ్చేవాళ్లు ఎక్కువ మొత్తం ఈ.ఎం.ఐ చెల్లించవచ్చు.
